WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎవరీ 'ఏసురత్నం'...!?

గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైకాపా సమన్వయకర్తగా నియమించబడ్డ 'ఏసురత్నం' ఎవరా అంటూ ఆ ప్రాంతానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన అధికారిగా 'ఏసురత్నం'కు పేరుంది. ఆయన పదవీ విరమణ సమయంలో సచివాలయంలో ఎస్‌పిఎఫ్‌శాఖలో పనిచేస్తూ ముఖ్యభద్రతాధికారిగా బాధ్యతలునిర్వహించారు. ఆయనకు టిడిపి నాయకులు, మంత్రులు చాలా మంది తెలుసు. టిడిపి అధికారం కోల్పోయిన తరువాత 'ఏసురత్నానికి' ప్రమోషన్‌ వచ్చి బదిలీలో వెళ్లారు. తరువాత ఆయన అక్రమంగా ఆస్తులు కూడేసుకున్నారని ఏసీబీ కేసులు పెట్టింది. ఇదంతా తనపై కావాలని కుట్ర చేసి దాడులు చేశారని..తాను ఏ విధంగా అక్రమాస్తులు కూడబెట్టానని...చెప్పాలని ఆయన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కలసి గోడు వెల్లబోసుకోవడంతో..ఆయన కనికరించి ఆశీర్వదించారు. ఆ తరువాత ఏసురత్నం ఎక్కడ పనిచేశారో కానీ..తాజాగా వై.ఎస్‌.జగన్‌ ద్వారా ఎవరిద్వారా ఆకర్షించారో...ఎంత ముట్టచెప్పారో..కానీ..గుంటూరు సమన్వయకర్త పదవిని పొందారు. దళిత క్రిష్టియన్‌ అయిన ఏసురత్నాన్ని గుంటూరు-2లో ఎలా నియమించారు. టిడిపికి బలమైన మద్దతు ఉన్న ఈ నియోజకవర్గంలో 'ఏసురత్నం' టిడిపి అభ్యర్థిని ఎదుర్కోగలరా..? కోట్ల రూపాయలు ముఖ్యమా..? టిడిపిని  ఓడించడం ముఖ్యమా..? దీని వెనుక ఏమేమి జరిగిందో..అనేదానిపై వైకాపా నేతలు ఆరా తీస్తున్నారు. అప్పిరెడ్డి తప్ప వేరే ఎవరినీ గెలిపించమని వైకాపా నేతలు చెబుతున్నారు. 

  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుట్ర పన్నారా..? లేక కోట్ల రూపాయలు ఉన్నాయని...ఏసు రత్నాన్ని అభ్యర్థిగా నియమించారా..? అప్పిరెడ్డిని కాదని..ఏసురత్నాన్ని ఎవరికి కోసం నియమించారు.? ఎందు కోసం నియ మించారు..? విధేయులైన కార్యకర్తలు 'జగన్‌'కు అక్కర్లేదా..? ఒకవేళ 'కన్నా'ను గెలిపించాలని 'ఏసురత్నాని' దింపినా...తాము 'కన్నా'ను అయినా..ఏసురత్నాని అయినా..ఓడిస్తామని...తాము అప్పిరెడ్డిని ఇండిపెండెంట్‌గా బరిలోకి దించుతామని..స్వార్థం కోసం పార్టీని బదిలీ పెట్టడాన్ని సహించమని వైకాపా నేతలు చెబుతున్నారు. ఏసురత్నమేమిటి..? ఆయన వైకాపా అభ్యర్థి ఏమిటి..? ఇదంతా కలగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు వీరవిధేయుడైన ఏసురత్నం.. వైఎస్‌ చేసిన సహాయం వల్ల వైకాపాలో చేరారా..? లేక 'జగన్‌'కు ముడుపులు ముట్టచెప్పి...ఆయన పార్టీలో చేరారా..? ఈ విషయంలో మధ్యవర్తుల ఎవరు..? పోలీసు అధికారులు కూడాఈ విషయంపై వివరాలు సేకరిస్తున్నారు..? ఏది ఏమైనా... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైకాపాలో ఈ రకమైన ముసలం ఏర్పడడంతో టిడిపి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏసురత్నం వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తే...టిడిపి మెజార్టీ ఎంత..? అనేదానిపైనే ఎన్నికలు ఉంటాయని టిడిపి నాయకులు అంటున్నారు. స్థానిక నేతలను బలిపశువులను చేయడం 'జగన్‌'కు ప్యాషన్‌గా మారిందని, ఏమిటి..ఇది..? అని పార్టీకి చెందిన ఆయన సామాజికవర్గ నేతలు కూడా తప్పుపడుతున్నారు. మాజీ పోలీసు అధికారి ఏసురత్నం వైకాపాలో చేరి సమన్వయకర్తగా నియమింపబడి సంచలనం సృష్టించి స్థానిక నేతలకు నిద్రలేకుండా చేశారు.

(449)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ