WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'అమర్‌నాథ్‌రెడ్డి'కి...'మరదలి' సవాల్‌...!?

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్వయాన సోదరుడు భార్య అయిన 'అనిషారెడ్డి' ఎంపిక చేసే విషయం మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి అసలు తెలియనే తెలియదట. అంతకు ముందు ఆమెను పుంగనూరు అభ్యర్థిగా ఎంపకి చేస్తారని ప్రచారం జరగగా..పంచాయితీరాజ్‌ మంత్రి లోకేష్‌ ఎదుట మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పట్టుపట్టారని..దీనిపై ఆయన స్పందిస్తూ..తానేమీ చేయలేను..సిఎంను కలవాలని చెప్పారని 'పుంగనూరు'లో ప్రచారం జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబే గెలిపిస్తున్నారని...బాహాటంగా ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. విమర్శలకో, ప్రచారాలకో 'చంద్రబాబు' నొచ్చుకుని అనుపరెడ్డి వ్యూహం ప్రకారం ఎంపిక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం టిడిపికి కంచుకోట. 1989లో టిడిపి అధికారం కోల్పోయినా..మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తండ్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో టిడిపి అధికారంలోకి వచ్చినా..పుంగనూరు అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఓడిపోయినా... 2004లో మళ్లీ టిడిపి అధికారం కోల్పోయినప్పుడు 'అమర్‌నాథ్‌రెడ్డి' గెలిచారు. అటువంటి కంచుకోట అయిన 'పుంగనూరు'లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపా అభ్యర్థిగా విజయం సాధించడంలో ఏదో మతలపు జరిగిందని చెప్పవచ్చు. బీసీ వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో 1983లో ఆర్టీసీ కండక్టర్‌ బత్తెన గోపాల్‌ విజయం సాధించి సంచలనం సృష్టించారు. అటువంటి కంచుకోటలో మంత్రి సోదరుని భార్యను ఎంపిక చేయడంపై స్థానిక నేతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఆమె గెలుస్తుందా..? తమ కుటుంబంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని..భావనతో..ఆమెను పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఈ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు బయటకుపొక్కింది. ఏది ఏమైనా చిత్తూరు జిల్లాలో తనకు మంత్రిగా ఉన్న రాజకీయంగా ఎదురుండదని భావించిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మరదుల్ని పుంగనూరు టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేయడం మింగుడుపడడం లేదు. ఇంతకు ముందే అన్నాదమ్ముల మధ్య అంతరం ఉందని..ఇప్పుడు అది పూర్తిగా పెరిగిందని స్థానిక నేతలు చెబుతున్నారు. 'అనిషారెడ్డి'ని పుంగనూరు అభ్యర్థిగా నియమిస్తున్నారనే సమాచారం మంత్రికి ముందు ఏ ఒక్కరూ చెప్పలేదు. వైకాపా అభ్యర్థి అయిన పెద్దిరెడ్డిని 'అనిషారెడ్డి' అయితే ఎదుర్కోగలదని స్థానిక నేతలు ఏకగ్రీవంగా చంద్రబాబుకు చెప్పారు. పుంగనూరులో ఈ సారి పోటీ చేస్తే...అవలీలగా గెలుస్తానని భావించిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్వయాన తన మరదల్ని నిలపడంతో ఏమి చేయాలో తెలియక విచార వదనంతో కనిపిస్తున్నారట. 

  2004లో కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని 'అనిషారెడ్డి' కుటుంబసభ్యులు పట్టుపట్టారు. 2009లో 'అనిషారెడ్డి' ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి మళ్లీ టిడిపిలో చేరారు. 2014లో ఆమెను టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని భావించినా...వెంకటరమణరాజును అభ్యర్థిగా నిర్ణయించి..ఈ సీటును టిడిపి కోల్పోయేలా చంద్రబాబు చేశారని స్థానిక నేతలు ఇప్పటికీ వాపోతున్నారు. అప్పట్లో ఆమె టిడిపి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారనే విమర్శలు ఉన్నా...ఆమెకు టిడిపి టిక్కెట్‌ దక్కకుండా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెరవెనుక ఉండి సఫలీకృతులయ్యారనే విమర్శ ఉంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాపారపరమైన విభేదాలతో పాటు కుటుంబ పరమైన విభేదాలున్నప్పటికీ..ఎట్టిపరిస్థితుల్లో 'పుంగనూరు' నియోజకవర్గంలో 'అనీషారెడ్డి'ని పోటీ చేయించాలని ఆమె భర్త పలుసార్లు చంద్రబాబును కలసి ఒప్పించారు. కొన్ని నెలల కిందట ఎవరిని ఎంపిక చేస్తే..బాగుంటుందనే దానిపై సమన్వయ కమిటీ సమావేశంలో 'అనిషారెడ్డి' ప్రస్తావించడంతో సమావేశంలో ఉన్న 'మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి' తీవ్రంగా వ్యతిరేకించారట. తాజాగా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి 'అనిషారెడ్డి'కి టిక్కెట్‌ దక్కకుండా ఎన్ని ఎత్తులు వేసినా...లోకేష్‌ ద్వారా ఒత్తిడి తేవాలని ప్రయత్నించినా విఫలమయ్యారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి మిమ్మలను పుంగనూరు టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేయడం ఇష్టం లేదు. కానీ మీపై ఉన్న నమ్మకంతో తప్పకుండా విజయం సాధించగలరనే భావంతో మీకు అవకాశం ఇస్తున్నాను..మీరు ఎవరినీ పట్టించుకోవద్దు..కష్టపడి పనిచేయండి..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించండి..అని చంద్రబాబు ఆమెకు చెప్పినట్లు ఆ కుటుంబ వర్గీయులతో పాటు..టిడిపి నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా పుంగనూరు టిడిపి అభ్యర్థిగా 'అనిషారెడ్డి'ని ఎంపిక చేయడం మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి మింగుడుపడడం లేదు. ఆయనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా..నిర్ణయం తీసుకున్నారని..దీనిపై ఆయన అలకపాన్పు ఎక్కినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

(262)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ