WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరు,నెల్లూరు కలెక్టర్ల బదిలీలు లేనట్లే...!?

గుంటూరు జిల్లా కలెక్టర్‌ 'కోనశశిధర్‌'ను బదిలీ చేసి..ఆయన స్థానంలో 'ప్రకాశం' జిల్లా కలెక్టర్‌ నవీన్‌చంద్‌ను నియమిస్తారని...అదే విధంగా కర్నూలు కలెక్టర్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తారని...'కోన శశిధర్‌'ను ర్నూలుకు బదిలీ చేస్తారని చంద్రబాబు వద్ద చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నెల్లూరు కలెక్టర్‌ 'ముత్యాలరాజు' తనను బదిలీ చేయాలని చాలా రోజుల కిందట  సిఎంను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి కోరినా అప్పట్లో...ఆయనను బదిలీ చేయలేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య తాను నలిగిపోతున్నానని..వారి బాధ తాను పడలేనని..అంతకు ముందు 'ముత్యాలరాజు' ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించుకున్నారు. కానీ...ఆయన విన్నపాలును..వారు అంగీకరించలేదు. దాంతో..అక్కడ అయిష్టంగానే కొనసాగుతున్న ఆయనను ఇప్పుడు జరిగే బదిలీల్లో కూడా మార్చడం లేదని తెలుస్తోంది. నెల్లూరు కలెక్టర్‌ 'ముత్యాలరాజు'ను బదిలీ చేయవద్దని మంత్రి సోమిరెడ్డి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నారట. మంత్రి సోమిరెడ్డి చెప్పిన పనులన్నీ ఆగమేఘాలపై చేస్తుండడంతో..ఆయననే కొనసాగించాలని ముఖ్యమంత్రి వద్ద సోమిరెడ్డి పట్టుపడుతున్నారట. దీంతో..ఆయన బదిలీ ఆగిపోయిందని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

 గుంటూరు జిల్లా కలెక్టర్‌  'కోనశశిధర్‌'ను బదిలీ చేయాలని సిఎంఒ అధికారులు పట్టుబడుతుండగా...ఆయనను బదిలీ చేయ వద్దని...సీనియర్‌ ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు' ఇతర సీనియర్‌ టిడిపి నాయకులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో 'చంద్రబాబు' పట్టుపట్టి..ఇతర ఎమ్మెల్యేలతో, మంత్రులతో చర్చించి...గుంటూరు కలెక్టర్‌గా 'కోన'ను నియమించారు. తన అంచనాల మేరకు...'కోన' పనిచేయలేకపోయారని, రాజకీయ అవినీతిని అణగ దొక్కడంలో కలెక్టర్‌ సీరియస్‌గా లేరనే ఉద్దేశ్యం సిఎంకు ఉందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అదంతా ప్రచారమేనని...ఆయన సామర్ధ్యం మేరకు పనిచేస్తున్నారని, ఆయనపై ఇతర ఆరోపణలు ఏమీ లేకపోవడంతో.. ప్రస్తుతానికి ఆయనను బదిలీ చేయరని సిఎంఒ వర్గాలు అంటున్నారు. గుంటూరు, నెల్లూరు కలెక్టర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నారని..వారిపై తీవ్ర విమర్శలు కానీ, ఆరోపణలు కానీ లేకపోవడంతో వారిని అక్కడే కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలెక్టర్లు ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారనే చిన్న చిన్న కారణాలు తప్ప..పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన ఆరోపణలు లేవని..వారిని అక్కడే కొనసాగిస్తే...బావుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాగా  గుంటూరు జిల్లాకు వరుసగా రెండుసార్లు దళిత సామాజికవర్గానికి చెందిన వారే కలెక్టర్లుగా వస్తున్నారని..ఈ సారి వేరే సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తే...కులాల ప్రస్తావన ఉండదనే ఉద్దేశ్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో ఉందనే మాట అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది. దీనిలో భాగంగా సమర్థుడు, నిజాయితీపరుడు అయిన ప్రకాశం జిల్లా కలెక్టర్‌ 'నవీన్‌చంద్‌'ను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరిగిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే...దళిత సామాజికవర్గానికి చెందిన వారైనా..వారు సమర్థ వంతంగా పనిచేస్తుంటే..వారిని బదిలీ చేయాల్సిన అవసరమేమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇవన్నీ ఆలోచన లనేనని..ప్రస్తుతానికి పైన చెప్పిన ఇద్దరు కలెక్టర్లను మార్చే పరిస్థితి లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కాగా..ఇదుగో బదీలు..అదుగో బదిలీలు అంటూ గత ఆరు నెలలుగా జరుగుతున్న ప్రచారం ఇంత వరకూ వాస్తవ రూపం దాల్చలేదు. ఇప్పుడూ..అదే విధంగా ప్రచారానికే పరిమిత మవుతుందా...? లేక..ఆచరణ సాధ్యం అవుతుందా? వేచి చూడాల్సిందే..!

(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ