WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'పై బూతు పంచాంగం విప్పుతున్న 'కెసిఆర్‌,పవన్‌'లు..!

తెలంగాణలో తిరిగి అధికారం కైవసం కాదనే అనుమానంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ 'చంద్రబాబు'పై విమర్శలతో పాటు ఘాటైన పదజాలంతో ఓటర్లను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించిన విషయం విదితమే. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సభలకు, సమావేశాలకు 'జనం' వస్తున్నారు. వచ్చిన వారిలో ఎంత మంది పార్టీకి ఓటు వేస్తారు..అనే విషయంపై సర్వే జరిపించుకున్న 'జనసేన' అధిపతి 'పవన్‌కళ్యాణ్‌' తన సభలకు సినీ అభిమానంతో వస్తున్నారే తప్ప..వారంతా తనకు ఓటు వేయరని..వారిలో ఎక్కువశాతం టిడిపికే ఓటు వేస్తారని తెలుసుకున్న 'పవన్‌' టిడిపి, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా రావల్సిన నిధులు నిలచిపోయినా..విడుదల చేసిన నిధులను ఆపివేసినా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని 'పవన్‌' 'మోడీ'పై విమర్శలు చేయకుండా జాగ్రత్తపడుతూ...చంద్రబాబుపై విమర్శలు చేయడంలో పరమార్థం ఏమిటనే దానిపై కాపు సామాజికవర్గ ఓటర్లల్లో చర్చ జరుగుతోంది. 

  ఇదే విషయంపై 'ముద్రగడ పద్మనాభం' తన సన్నిహితులతో మాట్లాడుతూ 'చంద్రబాబు'పై ఎన్నాళ్లు విమర్శలు,ఆరోపణలు చేస్తాం...కాపు కార్పొరేషన్‌కు మూడు వేల కోట్లు నిధులు ఇచ్చారు..అసెంబ్లీలో రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపారు..ఇంకా ఆయనపై విమర్శలు చేస్తే ఓటర్లల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అన్నారట. అక్కడేమో..కెసిఆర్‌ను నిన్నా..మొన్నటి వరకు 'చంద్రబాబు'తో సఖ్యతతో మెలుగుతానని, వివాదాలు వద్దని, విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని...నిన్న చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడి కెసిఆర్‌, ఇక్కడ పవన్‌ వ్యవహారశైలిని గమనిస్తే..అక్కడ మళ్లీ అధికారం దక్కదనే అనుమానం కెసిఆర్‌కు, ఇక్కడ కనీసం సీట్లు రావనే భావన 'పవన్‌'లో ఉండడంతోనే విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టిడిపితో కెసిఆర్‌ పొత్తు పెట్టుకుంటే..అక్కడ వన్‌వేగా ఉండేదని, అదే విధంగా 'పవన్‌' టిడిపితో పొత్తు కుదుర్చుకుని..ఎన్నికలకు వెళితే...ఆయనకు గణనీయమైన సంఖ్యలో సీట్లు వచ్చేవి. అహంకారంతో, మూర్ఖత్వంతో తమను ఎవరూ ఏమీ చేయలేరని సెంటిమెంట్‌తో ఒకరు, సినీ అభిమానులున్నారనే అహంకారంతో అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడుతున్నారని రాజకీయ పరిశీలకులు తప్పుపడుతున్నారు. వివిధ ఛానెల్స్‌లో జరిగే చర్చావేదికల్లో ఈ ఇద్దరు నాయకులు వాడుతున్న భాషను తప్పుపడుతూ ఇలాంటి భాషను వారు ఉపయోగిస్తారని కలలో కూడా అనుకోలేదని అంటున్నారు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న చందంగా కెసిఆర్‌, పవన్‌లు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కోబోతున్నారు. అవినీతిపై 'పవన్‌' ఎన్ని విమర్శలు చేసినా..ఆయన పార్టీలో చేరిన నాయకులు గత చరిత్ర తెలుసుకుని విమర్శలు చేయగలిగితే పద్దతిగా ఉంటుందని టిడిపి నేతలు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా కెసిఆర్‌, పవన్‌లు చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు..చంద్రబాబుపై సానుభూతిని పెంచుతున్నాయి.. తప్ప..వారు చేసిన ఆరోపణలకు ఏ ఒక్కరూ మద్దతు తెలపడం లేదనేది వాస్తవం.

(279)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ