WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజమండ్రి' టిడిపి అభ్యర్థిగా 'అచ్చిబాబు'...!

1983 నుండి ఇప్పటి వరకు పదవులు ఇచ్చినా..ఇవ్వకపోయినా..పోటీ చేసే అవకాశం కల్పించకపోయినా..వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడకుండా..స్వంత అన్నతోనే ఢీ కొని టిడిపి అభ్యర్థిని గెలిపించిన మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు సోదరుడైన 'అచ్చిబాబు'ను రాజమండ్రి ఎంపి అభ్యర్థిగా ఎంపిక చేయాలని పలువురు నాయకులు 'చంద్రబాబు'పై ఒత్తిడి తెస్తున్నారు. 2009లో 'అచ్చిబాబు'ను 'రాజమండ్రి' ఎంపిగా పోటీ చేయించేందుకు రంగం సిద్ధం అయినప్పటికీ 'మురళీమోహన్‌'కు అవకాశం వచ్చింది. ఆయన ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో కూడా 'అచ్చిబాబు' పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. 'అచ్చిబాబు'ను 'రాజమండ్రి' నుంచి పోటీ చేయించి...ఏలూరు నుంచి 'మురళీమోహన్‌'ను పోటీ చేయించాలని 'చంద్రబాబు' భావించినా..అది కార్యరూపం దాల్చలేదు. దీంతో రెండుసార్లు పోటీ చేసే అవకాశం వచ్చి పోయినా..ఆయన కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారు. ఈ క్రమంలో స్వంత సోదరునితోనే 'అచ్చిబాబు' తలపడ్డారు. 

 ఆస్తిపాస్తులు సమవృద్ధిగా ఉన్న నేపథ్యంలో ఆయన 'రాజమండ్రి' ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దిగితే..అఖండ మెజార్టీతో విజయంసాధించడం ఖాయమంటున్నారు..లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అనేక మంది నాయకులు. ఈసారి మురళీమోహన్‌కు పోటీచేసే అవకాశం ఇవ్వకుండా 'అచ్చిబాబు'కు ఇచ్చేందుకు 'చంద్రబాబు' మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. తన కోడల్ని ఎంపీగా పోటీ చేయించాలని 'మురళీమోహన్‌' భావిస్తున్నా..అటువంటి ప్రయోగాలకు చంద్రబాబు అవకాశం ఇవ్వరని...'అచ్చిబాబు' వైపే చంద్రబాబు మొగ్గుతారని...పార్టీ నాయకులు చెబుతున్నారు. మరో రెండు,మూడు నెలలు గడిస్తే కానీ..రాజమండ్రి ఎంపి అభ్యర్థి ఎవరైనే దానిపై స్పష్టత రాదు. రెండుసార్లు పోటీ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారినా...ఈసారి పోటీ చేసే అవకాశం వస్తుందని, తాను చేసిన సేవలను 'చంద్రబాబు' గుర్తుపెట్టుకుని పోటీ చేసే అవకాశం తనకు వస్తుందని 'అచ్చిబాబు' నమ్మకంతో ఉన్నారు.

(548)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ