WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తిరుపతి ఎంపి టిడిపి అభ్యర్థిగా పోలీసు అధికారి..!?

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గతంలో కన్నా టిడిపి బలం పుంజుకున్ననేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలని 'చంద్రబాబు' ఆలోచిస్తున్నారు. 2014లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి టిడిపిలో చేరడంతో..ఆయనకు అవకాశం ఇస్తారని పలువురు భావించినప్పటికీ..తాజాగా గుంటూరు జిల్లాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారిని రంగంలోకి దించేందుకు ఆయన బంధు,మిత్రులు 'చంద్రబాబు'ను కలవబోతున్నారు. కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చును భరించే శక్తి ఆయనకు లేకపోయినా..తాము మద్దతుగా నిలబడి ఆర్థికంగా చేయూతనిస్తామని, పార్టీ కూడా ఆర్థిక పరంగా ఆయనకు సహాయం చేస్తే..ఆ పోలీసు అధికారి బంధువులు, పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పోలీసు అధికారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా..? ఆయనతో ఎవరైనా పార్టీ నాయకులు కానీ..ఆ అధికారి బంధు,మిత్రులు కానీ..ఈ విషయంపై మాట్లాడారా..అనే విషయం బయటకు రావడం లేదు. కానీ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..? ఏయే మండలాల్లో ఏ పార్టీకి మద్దతు ఉంది..అనే విషయాన్ని ఆ పోలీసు అధికారి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా..? పోలీసు అధికారి...? అనే విషయంపై కొందరు ఆరా తీసినా..ఆయన పేరును మాత్రం తెలుసుకోలేకపోయారు.

   'చంద్రబాబు' అంగీకరించాకనే తన పేరు బయటపెట్టవద్దని...చెప్పడంతో..ఆ అధికారి పేరు బయటకు రావడం లేదు. కానీ...ఆ పోలీసు అధికారిని ఎన్నికల బరిలోకి దింపితే పార్టీ ఇచ్చే నిధులతో, ఆయన బంధువులు ఇచ్చే నిధులతో అవలీలగా విజయం సాధించవచ్చునని పలువురు చెబుతున్నారు. మరో మూడు నెలల తరువాత తన నిర్ణయాన్ని చెబుతానని..అప్పటి వరకు తన పేరును బయటపెట్టవద్దని..ఆ పోలీసు చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆయన ఏడు నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాను తెలుసుకునేందుకు స్వంత మనుషులను పంపించారని బయటకు పొక్కింది. తిరుపతి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చింతామోహన్‌ ఎన్నికల బరిలోకి దిగడం ఖాయం. వైకాపా అభ్యర్థిగా వరప్రసాద్‌ మళ్లీ పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి అభ్యర్థిగా ఆ పోలీసు అధికారిని బరిలోకి దింపితే..అటు పార్టీ సహాయంతో, ఇటు బంధుమిత్రుల సహాయంతో అవలీలగా విజయంసాధిస్తారని వారు చెబుతున్నారు. ఈ విషయం 'చంద్రబాబు' దృష్టికి వెళ్లిందా..? లేదా అనేది బయటకు పొక్కడం లేదు. గుంటూరు జిల్లాలో పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన బంధుమిత్రులతో కొద్ది రోజుల కిందట సమావేశమైనట్లు తెలిసింది. త్వరలో ఈ సస్పెన్షన్‌కు చంద్రబాబు తెరదించే అవకాశం ఉంది. పోలీసు అధికారిని ఎంపీ అభ్యర్థిగా నియమిస్తారా..? లేక గతంలో ఓడిపోయిన అభ్యర్థికే మళ్లీ అవకాశం ఇస్తారా..? వేచి చూడాల్సిందే.

(303)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ