WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'ను తిడితే...ఓట్లేస్తారా...?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. తెలంగాణ ప్రజల నుంచి ఓట్లను గుంజేందుకు, తనపై ఉన్న అసంతృప్తిని మరుగున పరిచేందుకు ఉన్న ఒకే ఒక్క ఆయుధాన్ని మరోసారి ప్రయోగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లను ఆడిపోసుకుని ఫలితాలను సాధించిన 'కెసిఆర్‌' ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ప్రయోగిస్తున్నారు. చక్కగా పాలించమని అధికారాన్ని అప్పచెబితే...పాలన చేతకాక...ఇచ్చిన హామీలను నెరవేర్చక...ముందస్తు ఎన్నిలకు వెళ్లి ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తోన్న 'కెసిఆర్‌' వారిని మరోసారి మాయపుచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని బూతు పురాణం విప్పుతున్నారు.

  నాలుగేళ్ల పాలనలో నేను..ఇది చేశాను..ఇది చేయలేకపోయాను..అని చెప్పి ప్రజలను ఒప్పించి..ఓట్లు వేయించుకోవాల్సిన కెసిఆర్‌...చేసింది చెప్పడం చేత కాక...ఏమీ చేయలేదని..ప్రజలు గ్రహించారనే భావనతో 'చంద్రబాబు'ను తిడితే ఓట్లు పొందవచ్చుననే పాత కాలపు ఫార్ములాను మళ్లీ బయటకు తీసి తిట్ల పురాణం అందుకున్నారు. తెలంగాణలో ఈ నాలుగేళ్లు తాను సరిగా పాలించలేకపోవడానికి 'చంద్రబాబే' కారణమని...ఆయన చెబితే..తెలంగాణ ప్రజలు నమ్ముతారా..? 'చంద్రబాబు' ప్రతిదానికి అడ్డం పడుతున్నారని..కెసిఆర్‌ అనుకుంటే...అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లు ఏమి చేశావు..? 'అన్న' చెప్పినట్లే...చేస్తానని..'అమరావతి'కి మాటి మాటికి..ఎందుకువచ్చావు..? నీ మండలాలను...'చంద్రబాబు' గుంజుకుంటుంటే... నీవేం చేస్తున్నావు..? చేతులకు గాజులేసుకుని చూస్తున్నవా..? నీ సీలేరు ప్రాజెక్టును లాక్కుంటుంటే...చేతకాక బిత్తర చూపులు చూస్తున్నవా..? తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన నీవు..నీ మండలాలు, నీ ప్రాజెక్టులు లాక్కుంటుంటే...చేతకాని వాడిలా...ఫామ్‌ హౌస్‌లో పండినవా..? చంద్రబాబు లాక్కుంటుంటే..నీకు ఆపడం చేతకాని నీవు..మళ్లీ ప్రజలు నీకు ఓటేయాలా..? చేతకాలేదని చెప్పిన నీకు మళ్లీ ప్రజలు ఓట్లేస్తారా..? ఎందుకీ మాయ మాటలు..? 'మోడీ'ని అడ్డం పెట్టుకుని...'చంద్రబాబు' నీ మండలాలు లాక్కుంటుంటే..నీవెందుకు...'మోడీ'కి రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేశావు..? నా మండలాలను లాక్కున్న 'చంద్రబాబు'కు 'మోడీ' మద్దతుఇస్తుంటే..వాళ్లు పెట్టిన అభ్యర్థులకు ఓటెందుకేశావు..? అవిశ్వాస తీర్మానంతో..'మోడీ'ని పడగొడతామని..దేశంలోని ప్రతిపక్షాలన్నీ...నినదిస్తే..అదే 'మోడీ'ని ఎందుకు రక్షించావు..? తెలంగాణకు 'చంద్రబాబు, మోడీ' ఇద్దరూ కలసి అన్యాయం చేస్తుంటే..వాళ్లను ఎదిరించాల్సిన నీవు...ఢిల్లీ చుట్టూ...అమరావతి చుట్టూ...ఎందుకు తిరిగావు..నీకు చేతకాలేదంటావా..? మరి అదే మాట చెప్పు..? మా కెసిఆర్‌కు చేతకాలేదు..మళ్లీ ఓట్లేస్తే..మరోసారి ప్రయత్నం చేస్తాడేమో..అని నీ తెలంగాణ ప్రజలు అనుకుంటారేమో..? నాలుగేళ్లు మౌనంగా ఫామ్‌హౌస్‌లో పడుకుని..హడావుడిగా ముందస్తు ఎన్నికలకు వెళితే..ప్రజలకు సమాధానం చెప్పలేక...తిట్ల పురాణం అందుకున్నానని..ప్రజలకు చెప్పు...?

  అసలు ఈ నాలుగేళ్లల్లో నీవు చేసిందేమిటి..? ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు అయ్యాయి. ఇంటికో ఉద్యోగం అన్న మాట..ఏమైంది..? దళితులకు మూడెకరాల భూమి అన్న మాటయేమైంది...? హైదరాబాద్‌ నగరాన్ని సింగపూర్‌ చేస్తానన్న హామీ ఏమైంది..? కరీంనగర్‌ను లండన్‌ చేస్తానన్న మాట ఎక్కడికి పోయింది...ఎన్ని ఇళ్లకు నల్లాలు వచ్చాయి...ఎంత మంది పోరగాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి..? బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు..? తెలంగాణ వస్తే..కాలు అడ్డంపెట్టి నీళ్లు తెస్తానంటివి కదా..? ఎన్ని నీళ్లు తెచ్చి..తెలంగాణను సస్యశ్యామలం చేశావు..? మిగులు బడ్జెట్‌ లోటు బడ్జెట్‌ ఎందుకైంది..? ఏమి సాధించావు..ఈ నాలుగేళ్లల్లో అన్నది చెప్పకుండా...? 'చంద్రబాబు' నా మండలాలను లాక్కున్నాడు...నా విద్యుత్‌ ప్రాజెక్టును లాక్కున్నాడు..? ప్రాజెక్టులకు 'చంద్రబాబు' అడ్డం పడుతున్నాడంటూ..సొల్లు చెబితే ప్రజలు నమ్ముతారా..? పాలించమని అధికారాన్ని అప్పచెబితే...రెండుసార్లు కూడా సచివాలయానికి రాకుండా...ఫామ్‌ హౌస్‌లో కూర్చోని యజ్ఞాలు, యాగాలు చేస్తూ కాలం గడిపిన వ్యక్తికి...'చంద్రబాబు' అడ్డుపడ్డారంటే...ప్రజలు నమ్ముతారా..? ఓట్లేస్తారా..? ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని...నాడు నినదించి..లక్ష్యాన్ని సాధించిన నీవు..మళ్లీ అదే ఫార్ములాతో వస్తే...ప్రజలు నిన్ను నెత్తిన పెట్టుకుంటారా..? నాడు ఉద్యమ ద్రోహులన్న వారినే నీవు పదవులిచ్చి..పక్కన కూర్చుండబెట్టుకున్న సంగతిని తెలంగాణ ఓటర్లు గుర్తించలేదనుకున్నావా..?  నాడు తెలంగాణ కోసం వేల మంది చనిపోయారని లెక్కలేసిన నీవు..ఇప్పుడా సంఖ్యను తగ్గిస్తే... వారు గుర్తించలేదనుకున్నావా..? ఒక్క అబద్దాన్ని వెయ్యి సార్లు చెప్పి..లక్ష్యాన్ని సాధించిన నీవు..మరోసారి..అదే అబద్దాలతో.. అధికారంలోకి రావాలనుకుంటే అయ్యేపనికాదని సంగతి తెలుసుకుంటే మంచిది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషిస్తేనే ఓట్లు పడతాయన్న నీ వ్యూహం సరికాదు. ఇప్పటికైనా..చేసింది చెప్పుకుని..ఓట్లు అడుగు..మరోసారి ప్రజలు కరుణిస్తారేమో..?

(629)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ