WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నెల్లూరు లోక్‌సభ బరిలో 'మాగుంట'...!

ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'మాగుంట శ్రీనివాసులరెడ్డి'  ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం ఆయన మంత్రి పదవి కోరుకున్నారు..ఆ పదవి తనకు దక్కడం ఖాయమని నమ్మారు..వస్తుందని ఆశపడ్డారు. అవేమీ ఆచరణకు నోచుకోలేదు. నెల్లూరు జిల్లాల్లో టిడిపి పరిస్థితి రోజు రోజుకు మెరుగవుతున్న నేపథ్యంలో లోక్‌సభ అభ్యర్థిగాపోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై 'మాగుంట' ఒక సర్వే చేయించుకుని..ఆ సర్వే నివేదిక ద్వారా టిడిపి అభ్యర్థి విజయం ఖాయమని తెలుసుకుని..తానే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు 'మాగుంట'. 2014లో కేవలం పదివేల ఓట్లతో ఓడిపోయిన 'ఆదాల ప్రభాకర్‌రెడ్డి'నే పోటీ చేయిస్తున్నామని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ప్రకటించడం జరిగింది. తాజాగా రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో 'ఆదాల'ను ఎమ్మెల్యేగా పంపించి...తనకు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలనిచంద్రబాబును 'మాగుంట' కోరబోతున్నట్లు తెలిసింది. 

  నెల్లూరులోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతిరధమహారధులు ఎన్నికల బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో తన గెలుపు నల్లేరుపై నడకేనని 'మాగుంట' నమ్ముతున్నారు. మున్సిపల్‌ మంత్రి నారాయణ నెల్లూరు నుంచి..ఆత్మకూరు నుంచి బల్లినేని కృష్ణయ్య, కందుకూరు నుంచి రామారావులు ఎన్నికల బరిలో ఉండడం కలసి వచ్చే పరిస్థితి ఉంది. ఎంపీగా 'ఆదాల'ను ఎంపిక చేసినప్పుడు పోటీ చేయాలా వద్దా...? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు నీ వెనుక నేను ఉన్నాను..ఎంపీగా మీరు తప్పకుండా విజయం సాధిస్తారు..మీరు ఎవరి మాట వినవద్దు..పోటీ చేయాలి చెప్పడంతో..అయిష్టంగా అంగీకరించిన 'ఆదాల'కు తాజా పరిస్థితులను గమనిస్తున్నారు. మాగుంట నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసినా తనకు అభ్యంతరం లేదని, పార్టీ అభ్యర్థి గెలవడమే ముఖ్యమని..ఎవరైనా ఫర్వాలేదని 'ఆదాల' చెబుతున్నారు. ఒంగోలు లోక్‌సభ కన్నా..నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేయడమే మంచిదని 'మాగుంట' భావిస్తున్నారు. నిన్నటి వరకు తెలుగుదేశం బలహీనంగా ఉన్న 'నెల్లూరు'లో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు ప్రజల్లో పట్టున్న నాయకులు పార్టీలో చేరడంతో..టిడిపి బలం రెట్టింపు అయింది. దీంతో నెల్లూరు లోక్‌సభ సీటు సురక్షితమనే నమ్మకంతో..పట్టుపట్టైనా ఆయన పోటీ చేయడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనిపై పార్టీ నేత 'చంద్రబాబు' ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 'ఆదాల'కు అభ్యంతరం లేకుంటే...'మాగుంట' టిడిపి అభ్యర్థిగా ఎంపిక కావడం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

(181)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ