WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'గంటా' అంటే 'చంద్రబాబు'కు భయమా..!?

విద్యాశాఖ మంత్రి 'గంటా శ్రీనివాసరావు' అంటే 'చంద్రబాబు'కు బలహీనత, భయమా..? ఆర్థికంగా పలు నియోజకవర్గాల పరిస్థితిని చూసుకుంటారా..? అనే విషయమా..? లేక ఇతర బలహీనతలు ఏమైనా ఉన్నాయా..? పూర్తి విషయాల్లోకి వెళితే..విశాఖపట్నం ఎంపీగా ఎవరిని నియమించాలి...జిల్లా అధికారులుగా ఎవరిని నియమించాలి..అనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 'గంటా' నిర్ణయానికే విలువ ఇస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. తాను పార్టీలో 35 ఏళ్లుగా ఉన్నాను..అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను..రెండుసార్లు మాత్రమే ఓడిపోయాను..పార్టీలు మారిన 'గంటా'కు తనకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిచినా..ఓడినా..పార్టీ అధికారంలోకి వచ్చినా..రాకున్నా...తాను పార్టీ మారే పరిస్థితి లేదు...అని రోడ్లు,భవనాలశాఖమంత్రి అయ్యన్నపాత్రుడు పదే పదే చెబుతున్నారు. అవకాశవాదిగా, వ్యాపారవేత్తగా ముద్రన్న 'గంటా' ఇప్పుడు ఎన్ని పార్టీలు మారారు. అటువంటి 'గంటా'ను 'చంద్రబాబు'నమ్మడం ఏమిటి..? వందల కోట్ల సొమ్ములు ఉంటే విధేయతను పరిగణలోకి తీసుకోరా..? అని మంత్రి అయ్యన్న బాహాటంగా, ఆవేశంగా ప్రకటించినా...చెవిటివాని ముందు శంఖం చందమే..వాటిని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మంత్రి గంటా తమ పార్టీలో చేరడం ఖాయమని వైఎస్‌ జగన్‌కు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పలుసార్లు ప్రకటించిన విషయాన్ని మంత్రి అయ్యన్న గుర్తు చేస్తున్నారు. తాను పార్టీ మారే ప్రసక్తేలేదు..తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ నేత 'చంద్రబాబు' నిర్ణయిస్తారు..ఎవరెవరో ఏదో వ్యాఖ్యలు చేసినంత మాత్రాన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రి గంటా...? కానీ మంత్రి నారాయణతో బంధుత్వం ఉన్న కారణంతో గతంలో కన్నా ఆయన రాజకీయ, అధికార, ఆర్థిక బలం రెట్టింపు అయింది. 

  ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని పోటీ చేయించాలి..? అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ఎవరెవరిని అభ్యర్థులుగా నిలపాలనే దానిపై మంత్రి గంటా సూచనలకే 'చంద్రబాబు' విలువ ఇస్తారు. ఇప్పటికే మంత్రి అయ్యన్న 'గంటా'పై ఎన్ని విమర్శలు చేసినా..బాహాటంగా పత్రికలకు ఎక్కినా క్షమించి వదిలేశాను..పార్టీలో సీనియర్‌ అనే గౌరవం తప్ప..ఆయన కుమారుడు, ఆయన విశాఖలో ఏమి చేశారో తనకు తెలుసనని...పంచాయితీరాజ్‌ మరియు రోడ్లు భవనాల శాఖలో మంత్రి నిర్ణయంతో ఏమి జరిగిందో తనకు తెలునని..కానీ గౌరవప్రదంగా మంత్రిని చూస్తున్నాని వదిలేస్తున్నాను..ఇది తన చాతకానితనంగా ఆయన భావిస్తున్నారని కొందరు పార్టీ నాయకులతో చంద్రబాబు అన్నట్లు తెలిసింది. మంత్రి గంటా తనపై ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేయలేదని, ఏదైనా ఉన్నా పార్టీలో చర్చించుకోవాలి..లేదా..తన దృష్టికి తేవాలి 'అరకు' ఎమ్మెల్యే సర్వేశ్యరావు హత్య జరగకుండా ఉంటే...'అయ్యన్న' దూకుడుకు 'చంద్రబాబు' దూకుడు వేసేవారు. ఏదైనా 'గంటా'కు ఉన్న రాజకీయ చాతుర్యం, ఆర్థిక వనరులతో పాటు..పలువురి నాయకులతో ఉన్న సాన్నిహిత్యం, మంత్రి నారాయణతో ఉన్న బంధుత్వం అనేక సందర్బాల్లో కలసి వచ్చింది. ఒక విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి గంటా నిర్ణయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేరు. దానికి ఉదాహరణే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను విశాఖ కలెక్టర్‌గా నియమించబోతున్నారని గత ఆరు నెలల నుంచి ప్రచారం జరుగుతున్నా..దాన్ని అమలు కాకుండా 'గంటా' అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరవిధేయుడిగా, నమ్మినబంటుగా, సమర్థుడైన ఐఎఎస్‌ అధికారిగా పేరున్న 'భాస్కర్‌'ను విశాఖ కలెక్టర్‌గా ఇంత వరకు బదిలీ చేయలేదంటే మంత్రి 'గంటా' ఒత్తిడిలు ఎంత తీవ్రంగా పనిచేశాయో..స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా...మంత్రి గంటా అంటే భయమో..లేక అభిమానమో..లేక ఇతరత్రా కారణాలు చంద్రబాబుపై బలంగా పనిచేస్తున్నాయనేది వాస్తవం. ఈ విషయాలను తెలుసుకోకుండా మంత్రి అయ్యన్న ఆరోపణలు చేసి 'చంద్రబాబు' దృష్టిలో పలుచన అవుతున్నారు.

(184)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ