WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రివర్గ విస్తరణపై లీకులెందుకు 'బాబూ'...!

ఆలూలేదూ...చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. అదుగో..ఇదుగో మంత్రివర్గ విస్తరణ కేవలం ముస్లిం,మైనార్టీల కోసమే చంద్రబాబు విస్తరణ చేయబోతున్నారని రెండు పత్రికలు ప్రచురించిన కథనాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు న్యూస్‌ పేపర్‌ రేపు చిత్తుపేపర్‌గా ఎలా మారుతుందో..ఆ విధంగా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది రోజులు కౌన్సిల్‌విఫ్‌ షరీఫ్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని ప్రచారం జరిగింది. షరీఫ్‌కు వద్దు...ఫరూక్‌ ముద్దు అని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాన్ని కూడా ప్రచురించింది. చివరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా..? లేదా అనే విషయం పక్కకు పెడితే...'షరీఫ్‌'కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. తాజాగా మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే సర్వేశ్యరరావు కుమారునికి ముందుగా మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు 'చంద్రబాబు' చెప్పారని బయటకు పొక్కింది. అసలు మంత్రివర్గ విస్తరణ జరుపుతారా..? లేదా..అని అనుమానాలు ఉండగా..తాజాగా మరో కొత్త పరిస్థితి తెరపైకి వచ్చింది. 

  విశాఖకు చెందిన ఎమ్మెల్సీ మూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో సర్వేశ్వరరావు కుమారుని పోటీకి నిలిపి..ఆయనను గెలిపించి మంత్రి పదవి ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. మొన్న షరీఫ్‌, నిన్న ఫరూక్‌, నేడు శ్రావణ్‌కుమార్‌ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేయడం ఖాయమని, త్వరలో తేదీలు వెల్లడిస్తామని..అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పారు. ఈ విధంగా రోజుకో పేరు తెరపైకి రావడంతో..మంత్రివర్గ విస్తరణ అసలు జరుగుతుందా..? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఈ రకంగా లీకులు చేయిస్తున్నారు..? ఇప్పుడు ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా..పార్టీకి అదనంగా ఒరిగేదేమీ ఉండదు. తమ సామాజికవర్గాలకు మంత్రి పదవులు ఇవ్వలేదని ముస్లిం,మైనార్టీలు, గిరిజనులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ రెండు సామాజికవర్గాలకు మంత్రి పదవి ఇస్తే...వారి ఓటర్లు పార్టీకి బ్రహ్మరథం పడతారా..? ఎప్పుడో చేయాల్సిన మంత్రివర్గ విస్తరణను వాయిదాలపై వాయిదాలు వేసుకుంటూ...మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదుగో మంత్రివర్గ విస్తరణ..అదుగో మంత్రివర్గ విస్తరణ అంటూ చంద్రబాబు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

(174)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ