WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'ను టార్గెట్‌ చేస్తే...కెసిఆర్‌కే నష్టం...!

తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గత రెండు రోజుల నుండి ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడంతో కాంగ్రెస్‌ నేతలను బెదరగొట్టవచ్చుననే వ్యూహం దానిలో అందని రాజకీయపరిశీలకలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌,టిడిపి, సిపిఐ, కోదండరామ్‌లు కలసి పోటీ చేస్తే 80 నుండి 90 సీట్లు రావడం ఖాయమని...కెసిఆర్‌కు తెలిసింది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చిగొట్టి అదుగో..మళ్లీ ఆంధ్రా పాలకులు వస్తున్నారు..ఇదుగో...ఆంధ్రా పాలకులు మళ్లీ పెత్తనం చేస్తారు..అని తెలంగాణ ఓటర్లు చేస్తోన్న కుయుక్తులు ఎంత వరకు పనిచేస్తాయి..? ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ సీరియస్‌గా పరిగణించడం లేదు. మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బాహాటంగా మాట్లాడుతూ..ఆ రోజు 'చంద్రబాబు' లేఖ ఇవ్వడంతో తెలంగాణ వచ్చిందని...తెలంగాణ రావడం వెనుక ఎన్నో కారణాలున్నాయి...దీనిలో 'చంద్రబాబు' ఇచ్చిన లేఖ కూడా కారణమని చెప్పడంతో..కెసిఆర్‌ దీనిపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ఎంఐఎఎంకు వస్తాయని..మిగతా 112 సీట్లల్లో ఎవరికి మెజార్టీ వస్తే వాళ్లకే అధికారం వస్తుందని..ఈ రోజుటిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నా..ఎన్నికల నాటికి వారు అండగా ఉంటారో లేదో తెలియదు. తెలంగాణలో టిడిపి ఉనికిలేదు..ఆపార్టీ చచ్చిపోయిందని..మంత్రులు హరీష్‌రావు,కెటిఆర్‌లు ఎన్నో సందర్బాల్లో విమర్శలు చేసిన విషయాన్ని కెసిఆర్‌ మరిచిపోయారేమో..? ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత..ఏ సెంటిమెంట్‌లు పనిచేయవని, సెంటిమెంట్‌ ఒకసారి మాత్రమే పనిచేస్తుందని కెసిఆర్‌ తెలుసుకోలేకపోతున్నారు. టిడిపితో పొత్తు ఉంటేనే అధికారం దక్కుతుందని..కాంగ్రెస్‌ నేతలందరికీ తెలుసు. ఈ విషయంలో 'రాహుల్‌గాంధీ' రహస్య సర్వే చేయించారని..టిడిపి ప్రభావం అనేక నియోజకవర్గాల్లో ఉందని తెలుసుకుని..ఆపార్టీతో పొత్తు పెట్టుకోవాలని..ఆదేశించారు..కోమటిరెడ్డి బ్రదర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే మందలించారు. సెటిలర్స్‌ ఉన్న నియోజకవర్గాల్లోనే కాకుండా నల్లగొండ, ఆదిలాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ వంటి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలిచే అంత పట్టు లేకున్నా కొంత వరకు పట్టు ఉన్న మాట యధార్థం. ఆయా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించలేకపోయినా..వారు ఎవరికి మద్దతు ఇస్తే..వారు విజయం సాధించడం ఖాయం. ఇవన్నీ తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర ముఖ్యులు టిడిపితో పొత్తుకు మొగ్గుచూపుతున్నారు. 

  కెసిఆర్‌కు ఏయే నివేదికలు అందాయో..ఆయన గత వారం రోజుల నుంచి ఆందోళనతో కనిపిస్తున్నారని టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కొన్ని సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం కెసిఆర్‌కు శాపమైంది. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపితో కలసి పోటీ చేసినా...స్వంత బలంతోనే టిడిపి అభ్యర్థులు గెలిచారో తప్ప..బిజెపి బలంతో కాదనే విషయం..ఆ పార్టీ నేతలు గెలిచిన చోట్ల విశ్లేషిస్తే తేలుతుంది. చంద్రబాబు అంటే కెసిఆర్‌ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..? ఎందుకు భయపడుతున్నారు..? అనే విషయంలో ఆయన అంతరంగికం బయటపడకపోయినా..? ఏదో జరిగే అవకాశాలున్నాయనే నమ్మకంతో ఈ దాడి ప్రారంభించారని స్పష్టం అవుతోంది.ఈ పరిస్థితుల్లో టిడిపితో పొత్తు లేకుండా కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో ఉండదని మీడియా ప్రతినిధులతో ఉత్తమ్‌ అంటున్నారు. కేంద్ర స్థాయిలో రాహుల్‌, తెలంగాణలో ఉత్తమ్‌ మిగతా వారికన్నా ఎక్కువ పట్టుదలతో ఉన్నారు. కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విషయం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డికి తెలుసు. అంతేకాకుండా మాజీమంత్రి నర్సింహులు..ఆ సామాజికవర్గాల ప్రభావాన్ని కథలు కథలుగా చెప్పేవారు. అటు జంటనగరాల్లో...ఇటు నల్లగొండలో టిడిపి సానుభూతిపరులైన ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారనేది యధార్థం. ఈ విషయాలన్నీ కెసిఆర్‌ తెలుసకోకపోవడమే...ఆయనకు శాపమైంది. టిడిపి,టిఆర్‌ఎస్‌లు కలిసిపోటీ చేస్తే..కాంగ్రెస్‌కు పది నుంచి 20సీట్లు దక్కేవని..ఒక పత్రికా సంపాదకుడు వ్యాసం కూడా రాశారు. చంద్రబాబును కెసిఆర్‌ టార్గెట్‌ చేయడం కెసిఆర్‌కు నష్టమని టిఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. తండ్రి కెసిఆర్‌ చంద్రబాబుపై చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు తన రాజకీయ భవిష్యత్‌కు ముప్పు తెస్తుందని మంత్రి కెటిఆర్‌ భయపడుతున్నారు. ఏది ఏమైనా 'చంద్రబాబు'ను మొన్నటి వరకు అనేక సందర్భాల్లో పొగిడిన కెసిఆర్‌ తాజాగా విమర్శలు, ఆరోపణలు చేసి..మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ ద్వారా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.

(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ