WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మానవత్వం పరిమళిస్తున్న మహోన్నత అధికారి...!

ఆయన ఏ పోస్టులో ఉన్నా..నెంబర్‌వన్‌ అధికారే...! ఐఎఎస్‌ అధికారిగా ఎంపికై అనేక జిల్లాల్లో వివిధ హోదాల్లో ఎన్నో పోస్టులను నిర్వహించారు...పలువురు ముఖ్యమంత్రి కార్యాలయాల్లో నమ్మకంగా విధేయతగా బాధ్యతలు నిర్వహించారు. ఆ అధికారిపై విమర్శలు చేసినవారు ఎందరు ఉన్నారో..లేదో తెలియదు కానీ..పొగడ్తలు కురిపించిన వారే ఎక్కువగా ఉంటారు. ఇన్నేళ్ల సర్వీసులో ఏ ఉద్యోగి పొట్టకొట్టలేదు..ఏ ఒక్కరికీ అపకారం చేయలేదు. చిన్నపాటి తప్పులకు పెద్దశిక్ష వేయలేదు..చిన్నపాటి తప్పులకు పెద్దశిక్ష వేసిన అధికారులకు ఉన్నా..ఈ అధికారి మాత్రం పెద్ద తప్పులకు కూడా చిన్న శిక్షవేశారు. అందుకే ఆయన మానవత్వం ఉన్న అధికారిగా పేరు పొందారు. ఆ అధికారి ఎవరో కాదు...! ప్రస్తుతం చీఫ్‌ విజిలెన్స్‌ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్వీ ప్రసాద్‌. కలెక్టర్‌గా, కమీషనర్‌గా, ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేకప్రధాన కార్యదర్శిగా వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహించి చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలునిర్వహించి..అధికారుల, ఉద్యోగుల మన్నలను పొందారు. ఇంతకు ముందు చీఫ్‌ విజిలెన్స్‌ కమీషనర్‌లుగా బాధ్యతలు నిర్వహించిన కె.వి.నటరాజన్‌, స్వామినాథన్‌, ఆర్‌.సి.సమాల్‌, సి.ఆర్‌.కమల్‌నాథ్‌లను బాధ్యతలునిర్వహించారు. వీరిలో స్వామినాధన్‌, సమాల్‌లు ఎంతో మంది ఉద్యోగులను చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేశారనే పేరుంది. ముఖ్యంగా దివంగత వై.ఎస్‌ హయాంలో ఆర్‌.సి.సమాల్‌ బరితెగించి..ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడి వారిలో కొంత మంది ఆత్మహత్యలకు కూడా కారణమైనారు. చీఫ్‌ విజిలెన్స్‌ కమీషనర్‌ పోస్టులో ఉంటే...ఉద్యోగులు,అధికారులను ఆడుకోవచ్చనే నమ్మకం సమాల్‌,స్వామినాథ్‌ను ఉండేదని విమర్శలు ఉండేవి. వీరందరికీ అతీతంగా..చిన్న తప్పులకు క్షమిస్తూ..ఉద్యోగుల జీవితాలతో ఆడుకోకుండా..కుటుంబాలు బజారునపడకుండా...ఆదరించారు..అభిమానంతో వారికి మరో నూతన జీవితం ప్రసాదించారు..నాలుగేళ్ల కిందట చీఫ్‌ విజిలెన్స్‌ కమీషనర్‌గా నియమితులైన ఎస్వీ ప్రసాద్‌. ఈ నాలుగేళ్లల్లో మాకు అన్యాయం జరిగింది..తమను బలిపశువులను చేశారు..తమ జీవితాలతో చెలగాటమాడారు..అనే రీతిలో ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదంటే...ఆయన తీసుకున్న నిర్ణయాలతో స్పష్టమైంది. 20వేలు, ముప్పయి వేలు లంచాలు తీసుకున్న ఉద్యోగులను ఇంతకు ముందు జైలుకు పంపేవారు. అలా లంచాలు తీసుకున్న వారిలో పై అధికారి చెబితేనే లంచాలు తీసుకున్నవారే ఉన్నారని చీఫ్‌ విజిలెన్స్‌ కమీషనర్‌ తెలుసుకున్నారు. కొందరిని లంచాలు ఇచ్చి బలి ఇచ్చారని...ఆయన దృష్టికి వచ్చింది. అందుకేనేమో..చిన్నస్థాయి లంచగొండిలకు ప్రాసిక్యూషన్‌కు పంపించకుండా...డిపార్ట్‌మెంట్‌ విచారణకు సిఫార్సు చేశారు. ఈ నాలుగేళ్లలో చాలా మందికి న్యాయం చేసిన ఘనత ఎస్వీ ప్రసాద్‌కే దక్కిందని ఇటు ఉద్యోగులు, అటు రాజకీయనాయకులు చెబుతున్నారు. ఎవరు ఫోన్‌ చేసినా పలుకుతారు..ఎవరు వెళ్లినా స్వయంగా కలుస్తారు..వారు చెప్పింది..ఓపిగ్గా వింటారు..ఫైళ్లను చూస్తారు..పరిశీలిస్తారు..స్వంతంగా ఆయననిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేసిన ఘనత ఎస్వీ ప్రసాద్‌కే దక్కింది. అంతకు ముందు ఏసీబీ చేసిన సిఫార్సుల ప్రకారమే కమీషనర్‌ నిర్ణయాలు తీసుకునేవారు. ఈ కారణాలతోనే మూడేళ్లు విజిలెన్స్‌ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన  ఎస్వీ ప్రసాద్‌ సర్వీసును మరో మూడేళ్లు పదవీకాలం పొడిగించారు చంద్రబాబు. ఇటువంటి మనస్తత్వం కలిగిన అధికారి మరొకరు వస్తారో..రారో కానీ..ఎస్సీ వంటి అధికారి రారని చెప్పవచ్చు. ఇది అన్ని వర్గాల అభిప్రాయం. నాలుగేళ్లల్లో ఎన్నో కేసులను ఆయన పరిష్కరించారు. ఆయా పైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి..అందులో ఎసీబీ నిర్ణయాలను చూసి స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మంది ఉద్యోగులకు పెద్ద శిక్షలు వేయకుండా, మానవత్వంతో క్షమించి చిన్నపాటి శిక్షలు వేశారు.

(451)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ