WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

66రోజుల్లో 'కెసిఆర్‌' మాజీ సిఎం కాబోతున్నారా..!?

ఈ ప్రశ్నకు తెలంగాణ సమాజం అవుననే అంటోంది. ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన 'కె.చంద్రశేఖర్‌రావు'కు ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టపోతున్నారనే దానిపై ఎటువంటి అనుమానాలు లేవు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన 'కెసిఆర్‌' తమను ఉద్దరిస్తాడనుకుంటే...నాలుగేళ్లలో ఏమీ చేయకుండా...మళ్లీ తనను సిఎంను చేయాలన్ని ప్రజల్లోకి వెళుతుండడం వారికి ఆయనపై విరక్తిని కల్గిస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం...డిసెంబర్‌11న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వస్తాయి. అంటే ఆ రోజు...ఓటమితోనే 'కెసిఆర్‌' రోజు ప్రారంభం అవుతుంది. అదే రోజు ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే...ఈ రోజును కూడా లెక్కలోకి తీసుకుంటే...మరో 66 రోజుల్లో 'కెసిఆర్‌' మాజీ ముఖ్యమంత్రి అవడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  నాలుగేళ్లల్లో ఏం చేశావు అంటే...? మరోసారి అవకాశం ఇవ్వండి...అన్నీ చేస్తాను..అంటోన్న 'కెసిఆర్‌'పై తెలంగాణ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినవాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చకపోగా...దాని గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో..ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి గండాన్ని దాటాలన్న ఆయను కుయుక్తులను ప్రజలు బాగానే గమనిస్తున్నారు. ఎందుకు అసెంబ్లీని రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పమంటే చెప్పకుండా...ఆంధ్రా పాలకులు, అమరావతికి దాసోహం అంటారు..అంటూ సెంటిమెంట్‌ను ఎగదోసి పని కానిచ్చుకోవాలన్న ఆయన ఉద్దేశ్యాన్ని ప్రజలు గ్రహించలేరా..? నాలుగేళ్ల పాలనలో..ఫలాని చేశామని చెప్పుకోలేని వాళ్లకు మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే..ఏమి చేస్తారు..? ఇప్పటికే కుటుంబం మొత్తాకి పదవులు ఇచ్చి... రాష్ట్రాన్ని జిల్లాల వారీగా వారికి కట్టబెట్టిన 'కెసిఆర్‌' మరో ఐదేళ్లు అదే చేస్తారని తెలియని అమాయకులా...తెలంగాణ ప్రజలు. సెంటిమెంట్‌ను రెచ్చిగొడితే...ఓట్ల వర్షం కురుస్తుందా..? ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌ ఆయనకు ఓట్లు తెచ్చిపెడుతుందా..? చక్కగా పాలించమని...అధికారంలో కూర్చోబెడితే...సచివాలయానికే రాకుండా...ఫామ్‌ హౌస్‌లో పడుకుని.. యాగాలు, యజ్ఞాలు చేసుకున్న సంగతి ప్రజలు అప్పుడే మరిచిపోయారా..? పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వమంటే...అదేదో..తానే చేస్తున్నానని.. విదేశాల్లో ఉన్నవారిని...దేశంలో ఉన్న వారిని ఆగమేఘాలపై రప్పించాలని లేకుంటే...తెలంగాణ పౌరులు కాదని ప్రచారం చేసిన సంగతిని ప్రజలు మరిచిపోయారా..? ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారిందో..? ఎవరి వల్ల మారిందో...ప్రజలకు తెలియదా..? వేలకోట్లతో చేపట్టిన...జలయజ్ఞం ఎవరి కోసమో...వారికి తెలియదను కుంటున్నారా..? అన్నీ తెలిసీనా..సమయం వేచి చూస్తోన్న ప్రజలకు ముందుగానే కెసిఆర్‌ను ఓడించే అవకాశం వచ్చింది. మరి...ఇన్ని చేసిన కెసిఆర్‌ను వారు మాజీని చేయకుండా ఊరుకుంటారా..?

(1075)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ