WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎంఒ అధికారులపై ఐటి దాడులు జ‌రుగుతాయా..??

ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులకు ఆదాయపన్ను అధికారులు సెగలు పుట్టించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇద్దరు అధికారులు ఐటి టెన్షన్‌తో నిద్రపోలేక పోతున్నారని ఆ వర్గాలే చెబుతున్నాయి. గత నాలుగేళ్లల్లో సిఎంఒలో ఆ విభాగానికి అనుబంధంగా పనిచేసే అధికారుల్లో కూడా త్వరలో ఆదాయపన్ను అధికారుల తాకిడి తగులుతుందని కొందరు సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సిఎంఒలోని ఇద్దరు అధికారులపై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు రావడంతో..వారిపై కూడా ఐటి దాడులు ఉండవచ్చునని సమాచారం వస్తోంది. ఇదే విషయాన్ని కొంత మంది అంతరంగికులు ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని, సిఎంఒపై పనిచేస్తోన్న అధికారులపై ఐటి అధికారులు ఎలా దాడి చేస్తారని ఎదురుదాడి చేస్తున్నారు. అధికారులు ఏ హోదాలో ఉన్నా...లక్షల కోట్ల వ్యాపారాలు చేసే వారిపైన ఐటి అధికారులు దాడులు చేయడానికి కారణాలు అవసరం లేదని ఆ అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రదిష్టపాలు చేసేందుకు ఒకరిద్దరూ సిఎంఒ అధికారులపై దాడులు చేయిస్తే ఎలా ఉంటుందని..చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే బిజెపి నాయకులు పథకాలు రచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

  ఒకవైపు ఐటి దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా..మరోవైపు సిఎంఒ అధికారులపై ఐటి దాడులు చేస్తే పరిస్థితి ఏమిటని..ఆందోళన చెందుతున్నారు. సిఎంఒలోని ఇద్దరు అధికారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇదేమీ పట్టనట్లు సీనియర్‌ అధికారి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సిఎంఒ అధికారుల్లో ఒక అధికారి కుటుంబసభ్యుల అవినీతి గురించి ప్రచారం జరగడం, మరో అధికారి ఉద్యోగుల పోస్టింగ్‌ల్లో, ఇతర విషయాల్లో అవినీతి జరిగినట్లు తెలియడంతో వారిద్దరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారట. దీనిపై వారిద్దరూ తమ అంతరంగికులతోమాట్లాడుతూ ఇది తమపై చేస్తోన్న కుట్ర అని...తామేమీ అవినీతికి పాల్పడలేదని..ఇంతకు ముందు తమకు ఎంత ఆస్తి ఉందో..ఇప్పుడూ అంతే ఉందని..ఆస్తుల విలువ పెరిగిందే కానీ...ఆస్తులు పెరగలేదని ఆ ఇద్దరు అధికారులు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా సిఎంఒ అధికారులపై ఐటి అధికారులు దాడులు చేస్తారో..లేదో కానీ..దానిపై మాత్రం విపరీతంగా ప్రచారం జరుగుతోంది. సిఎంఒలో పనిచేసిన ఒక కిందిస్థాయి అధికారి ఒకరు కోట్లాది రూపాయలు ఆస్తులు జరిగాయని ఇంతకముందే ప్రచారం జరిగింది. ఆయనపై ఐటి అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎన్నెన్ని ఆస్తులు ఎక్కడ కొనుగోలు చేశారో..వారికి ఆ సొమ్ము ఎలా వచ్చిందో..ఆరా తీశారు. ఆ విధంగా వచ్చిన సమాచారాన్ని ఐటి అధికారులకు పంపినట్లు తెలిసింది. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో సిఎంఒలో పనిచేస్తోన్న అధికారులపై ఐటి దాడులు చేస్తే పరిస్థితి ఏమిటి..?

(367)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ