WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ప్రజారాజ్యం' విజయం సాధించిన సీట్లు ఇస్తే..పొత్తుకు 'పవన్‌' ఓకే...!

ఉభయగోదావరి జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో 'ప్రజారాజ్యం' పార్టీ విజయం సాధించింది..ఏయే స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది..అదే దానిపై పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. ఒకవేళ వైకాపాతో పొత్తు కుదిరితే...2009లో 'ప్రజారాజ్యం' పార్టీ విజయంసాధించిన స్థానాలతో పాటు..రెండో స్థానంలో నిలిచిన స్థానాలను అడగాలని ఆపార్టీ భావిస్తోందట. దీనిపై సుధీర్ఘంగా కసరత్తులు చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో 'చంద్రబాబు'ను మళ్లీ ముఖ్యమంత్రిని కానిచ్చే పరిస్థితి లేదని..అవసరమైతే పొత్తులుపెట్టుకుంటామని 'జనసేన' అధిపతి పవన్‌కల్యాణ్‌ తనకు సన్నిహితులైన వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో 'పవన్‌' చేసిన పర్యటనలో కేవలం ఆయన సామాజికవర్గానికి చెందిన మెజార్టీ యువనేతలే హాజరవుతున్నారని, మిగతా సామాజికవర్గాలకు చెందిన వారు తక్కువగా హాజరవుతున్నారని ఆ  పార్టీ నేతల దృష్టికి వచ్చింది. కాపుల్లో పూర్తిస్థాయి పట్టుకోసం 'జనసేన' నాయకులు చేస్తోన్న ప్రయత్నాలుఎప్పటికప్పుడు విఫలం అవుతూనే ఉన్నాయి. అన్న ప్రజారాజ్యం పెట్టి స్వార్థం చూసుకున్నారు..ఆర్థికంగా ఆయనస్వలాభం చూసుకుని..తమను ముంచారని...ఇప్పుడు తమ్ముడు అదే రీతిలో ముంచుతారని సీనియర్‌ కాపునేతలు కనిపిస్తున్నారు. 2014లో టిడిపికి అనుకూలంగా ప్రచారం చేసినా కాపుఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు నియోజకవర్గాల్లో వైకాపా నేతలు విజయం సాధించారు. ఆ విధంగా విజయం సాధించిన నియోజకవర్గాల్లో కొందరు టిడిపిలో చేరిపోవడంతో..మరికొన్ని నియోజకవర్గాల్లో వైకాపాను గెలిపించిన నేతలు 'జగన్‌'కు వ్యతిరేకంగా మారారు. ఆ విధంగా మారిన వారిని తనవైపు తిప్పుకోవడంలో 'పవన్‌' ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. నాడు చంద్రబాబును తానే ముఖ్యమంత్రిగా చేశానని..ఆయనను మళ్లీ మాజీని చేసే బాధ్యత కూడా తనదేననే ధీమాతో 'పవన్‌' ఉన్నారు. అంతే కాకుండా 175 నియోజకవర్గాల్లో 'ప్రజారాజ్యం' విజయం సాధించిన నియోజకవర్గాలు ఎన్ని...రెండో స్థానంలో ఉన్న నియోజకవర్గాలు ఎన్ని అనేదానిపై చర్చిస్తోన్న 'పవన్‌', డిపాజిట్లు రాని నియోజకవర్గాల గురించి 'పవన్‌' ఆలోచించడం లేదు. 

 2019లో 'జనసేన,సిపిఐ,సిపిఎం'లు కలసిపోటీ చేస్తున్నాయి. 2009లో వామపక్షాలతో టిడిపికి ఎంత లబ్ది చేకూరిందో లేదో కానీ...వామపక్షాలతో తనకు కలసి వస్తుందని 'పవన్‌' భావిస్తున్నారు. ఇటీవల వామపక్షాలకు చెందిన కొందరు నాయకులు తమ సన్నిహితులతో మాట్లాడుతూ 'పవన్‌,జగన్‌, వామపక్షాలు కలసిపోటీ చేయబోతున్నాయని హింట్‌ ఇచ్చాయి. ఈ విషయం 'జనసేన' అధినేత 'పవన్‌' నుంచే వచ్చిందని వారు బయటపెట్టారు. ఏది ఏమైనా 2009లో విజయం సాధించిన నియోజకవర్గాలు, రెండో స్థానంలో వచ్చిన స్థానాలు 'జనసేన'కు ఇస్తే 'జగన్‌'తో పొత్తు కుదురుతుందని 'పవన్‌' చెబుతున్నారట. కానీ...'పవన్‌'తో పొత్తుకు 'జగన్‌'కు అంగీకరించే పరిస్థితి లేదని చెబుతున్నారు. 'జగన్‌'పై కాపుల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికి 'పవన్‌' చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో 'పవన్‌'పై ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. ఆయనపై ఉన్న అభిమానం ఓట్లుగా మారుతాయా..? లేక సినీ అభిమానంగానే మిగిలిపోతుందా..? 'చంద్రబాబు'ను రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలనే భావనతో 'పవన్‌' ఉన్నారు..ఏదో విధంగా ఎవరినైనా అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో 'జగన్‌' ఉన్నారు. పరిస్థితి ఎప్పుడు ఎలా ఎటుపోతుందో..అన్నవిషయం ఆ ఇద్దరికీ అంతుబట్టడం లేదు. ఏది ఏమైనా 'చంద్రబాబు'ను టార్గెట్‌గా నిర్ణయించుకుని 'పవన్‌' చేస్తోన్న పర్యటనలు వైకాపాకు అనుకూలంగా మారడం లేదు. మరి కొద్ది రోజుల్లో 'పవన్‌' ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు..? అనే విషయంపై ఆయనకుసన్నిహితులమని చెప్పుకుంటున్న పార్టీ నేతలు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో కనిపిస్తున్నారు.

(328)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ