WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరు వైకాపా ఎమ్మెల్యేల్లో నలుగురు అవుట్‌..ఒకరు డౌట్‌...!?

ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టలేని పరిస్థితులు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేల్లో నలుగురికి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని, మరో ఎమ్మెల్యేను తప్పించాలని అనుకున్నా..ఆఖరి నిమిషయంలో ఆయన సామాజికవర్గానికి చెందిన వారు కలసి విన్నవించడంతో... ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే మాచర్ల, మంగళగిరి,నర్సరావుపేట ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేసే అవకాశం ఇచ్చినా..టిడిపి అభ్యర్థుల ముందు ఆర్థికంగా నిలబడలేరనే కారణంతో ఆ ముగ్గురుని తప్పించేందుకు రంగం సిద్ధం అయింది. అదే విధంగా గుంటూరు-1 ఎమ్మెల్యే ముస్తాఫా టిడిపిలో చేరతారని ప్రచారం జరగడం, ఎంపి రాయపాటి సాంబశివరావుతో సన్నిహితంగా మెలిగి...ఆయనను కూడా తప్పించే అవకాశం ఉంది. బాపట్ల నియోజకవర్గానికి వస్తే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి గెలిచిన విషయం విదితమే. అయితే ఇక్కడ తమ సామాజికవర్గానికి చెందిన వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న 'రఘుపతి' రిటైర్డ్‌ సిఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో కలసి 'జగన్‌'ను కలసి ఆయనకు సీటు ఇవ్వాలని కోరారని, దీనికి 'జగన్‌' అంగీకరించారని..తెలుస్తోంది. మాచర్ల ఎమ్మెల్యేపై స్థానిక వ్యతిరేకతతోపాటు, ఆర్థికంగా బలహీనడు కావడంతో..ఆయనకు సీటు ఇవ్వడం లేదని తెలుస్తోంది. 

  నర్సరావుపేట ఎమ్మెల్యేపై ఇటీవల ఆరోపణలురావడం, జగన్‌ సామాజికవర్గానికి చెందిన వారు వ్యతిరేకంగా ఉండడంతో.. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మంగళిగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పాటు..మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. గుంటూరు-1 ఎమ్మెల్యేది అంతా స్వయం కృతమే. మాజీ ఎమ్మెల్యేను కాదని..ముస్తఫాకు అవకాశం ఇచ్చానని...ఆయన టిడిపిలో చేరడానికి ప్రయత్నించారని, ఆ పార్టీ ఎంపి 'రాయపాటి'తో సన్ని హితంగా ఎందుకు మెలిగారని, సిఎంను అన్ని సార్లు ఎందుకు కలిశారని పార్టీ నేతలను 'జగన్‌' నిలదీసినట్లు గతంలో బయటకు వచ్చింది. ఈ విషయంలో సకాలంలో స్పందించకుండా ముస్తఫా చేతులు కాల్చుకున్నారు. అంతే కాకుండా...రెడ్డి, దళిత క్రైస్తవులు ముస్లింల్లో మెజార్టీ ఓటర్లు 'జగన్‌'నుచూసే ఓటు వేస్తారనేది యధార్థం. మాచర్ల, గుంటూరు, నర్సరావుపేటలో ఆ పరిస్థితి ఉంది. మంగళగిరిలో ఆపరిస్థితి లేకపోయినా..'ఆళ్ల'పై వ్యక్తిగత వ్యతిరేకతతో ఆయనను పక్కనపెట్టబోతున్నారు 'జగన్‌'. బాపట్లలో తాత్కాలికంగా 'జగన్‌' హామీ ఇచ్చినా..రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'అజయ్‌కల్లం'ను ఇక్కడ నుంచి పోటీ చేయించాలని పట్టుదలతో ఉన్నారు. తమ కుటుంబానికి విధేయుడైన 'అజయ్‌'ను గెలిపించి పార్టీ అధికారంలోకి వస్తే..కీలకమైనశాఖకు మంత్రి పదవి ఇవ్వాలని 'జగన్‌' భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. అంతే కాకుండా దళిత సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు. తొంభశాతం ఓటర్లు 'జగన్‌'కు ఓటు వేయడం ఖాయం. మిగతా సామాజికవర్గాలకు చెందినవారు...టిడిపి ఇన్‌ఛార్జి 'అన్నం'పై వ్యతిరేకత ఉన్నవారు..టిడిపి వ్యతిరేకులు 'జగన్‌' పార్టీకి ఓటు వేస్తారు. చివరకు నియోజకవర్గంలో ఎటువంటి నిర్ణయం 'జగన్‌' తీసుకోనున్నారో ఇప్పుడు బయటపడపోయినా..భవిష్యత్‌లో తీసుకుంటారని స్థానిక నేతలు చెబుతున్నారు.

(గొరజవోలు శ్రీనివాసరావు)

(350)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ