WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎవరీ...శ్రీదేవి'...!

తాడికొండ వైకాపాలో గందరగోళం...!

గుంటూరు జిల్లా 'తాడికొండ' నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా డాక్టర్‌ శ్రీదేవిని నియమిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో వైకాపా కార్యకర్తల్లో అయోమయానికి కారణమైంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న క్రిస్టియాను తొలగించి..ఆ స్థానంలో ఆమెను నియమిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో 'క్రిస్టియా' టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయినా..నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారు. మళ్లీ 'జగన్‌' తనకే సీటు ఇస్తారని...ఆమె భావిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎస్సీ నియోజకవర్గమైన ఈ నియోజకవర్గంలో మరోసారి తానుపోటీ చేస్తే గెలవడం తధ్యమని ఆమె భావిస్తుండగా...'జగన్‌' మాత్రం ఆమె అయితే గెలవలేదని మరో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించగా...'శ్రీదేవి' దొరికిందని పార్టీ నేతలు చెబుతున్నారు. బలమైన టిడిపి అభ్యర్థిని ఎదుర్కోవాలంటే సొమ్ములు దండిగా ఉన్న వారైతేనే సాధ్యమని..అందుకే సొమ్ములు ఉన్న డాక్టర్‌ శ్రీదేవి వైపు 'జగన్‌' మొగ్గు చూపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా..ఇంతకీ 'శ్రీదేవి' ఎవరు..? ఆమె ఏమి చేస్తారు..? ఎక్కడ ఉంటారు..? అనే దానిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' వివరాలను సంపాదించింది.

ప్రస్తుతం డాక్టర్‌ శ్రీదేవి హైదరాబాద్‌లోని మొహదీపట్నంలో నర్సింగ్‌హోమ్‌ నడుపుతున్నారు. డాక్టర్‌గా ఆమెకు ఆ ప్రాంతంలో మంచి పేరే ఉంది. యువ డాక్టర్‌గా ఆమె బాగానే సంపాదిస్తున్నారట. వాస్తవానికి ఆమె గుంటూరు జిల్లా తాడికొండ మండలానికి చెందిన యువతి అని...ఆమె ఒక 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. 'శ్రీదేవి' భర్తకు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మేనమామ 'రవీంధ్రనాథ్‌రెడ్డి'కి బంధుత్వం ఉందని...వారి ద్వారానే ..శ్రీదేవి 'జగన్‌'ను కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. తన మేనమామ తెచ్చిన అభ్యర్థిని 'జగన్‌' ఓకే చేశారని నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. మొత్తం మీద...యువతి కావడం, అదీ డాక్టర్‌ కావడం, పైగా సొమ్ములు దండిగా ఉండడంతో..ఆమె అభ్యర్థిత్వాన్ని 'జగన్‌' ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఉన్నత విద్యావంతురాలైన మహిళ రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగిన పరిణామమే. మరి ఇన్నాళ్లూ పార్టీని అంటిపెట్టుకున్న 'క్రిస్టియా' పరిస్థితి ఏమిటని సగటు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

(843)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ