WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పాపం...తోపుదుర్తి బ్రదర్స్‌'...!

'పరిటాల రవీంద్ర' జీవించి ఉన్నప్పుడు కనీసం వాళ్లు ఆయనపై కానీ...ఆయన కుటుంబ సభ్యులపై కానీ పోటీ చేయాలనే ఆలోచనే చేయలేదు. ఆయన మృతి చెందిన తరువాత...కూడా పోటీకి...విముఖతనే ప్రదర్శించారు. కానీ..కీ.శే.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అండతో...2009 ఎన్నికల్లో వారు 'పరిటాల' సతీమణి 'సునీత'పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వారు 1707 ఓట్ల తేడాతో ఓడి పోవడంతో..ఇంకేముంది..బిగ్‌షాట్‌ను కొట్టేస్తాం..వచ్చే ఎన్నికల్లో...మాదే గెలుపు...మెజార్టీ కనీసం 20వేలకు తగ్గదని..ఒకటే ప్రకటనలు గుప్పించారు. కానీ...2014లో కూడా అదే ఫలితం వచ్చింది. గతంలో స్వల్ప తేడాతో ఓడిపోయిన..వారు..ఈసారి దాదాపు ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా..ఇప్పుడు మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలని మరోసారి 'పరిటాల' కుటుంబంపై పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈసారి తమ గెలుపు ఖాయమని..తమను ఎవరూ అడ్డుకోలేరని వారు చెబుతూ..ఎన్నికల కోసం ఎప్పుడో సంపాదించుకున్న ఆస్తులన్నింటిని తెగనమ్మేస్తున్నారట. ఇంతకీ ఎవరు వారు అంటారా..?

  అనంతపురం జిల్లా 'రాప్తాడు' నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన 'తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి' బ్రదర్సే వారు. 2009 ఎన్నికల్లో స్వల్ప తేడాతో 'రవి' కుటుంబ సభ్యులపై ఓడిపోవడంతో..ఇక్కడ తాము తప్ప ఎవరూ 'రవి' కుటుంబాన్ని ఓడించలేరని...గత కొన్నాళ్లుగా చెబుతున్న వారి మాటలపై 'జగన్‌' విశ్వాసం కోల్పోయారట. 2009లో ఓడిపోయారు...2014లో ఓడిపోయారు..ఈసారి ఎలా గెలుస్తారు..?అంటూ ఆయన వారిని ప్రశ్నిస్తున్నారట. గత ఎన్నికల్లో సొమ్ములు పెట్టలేక ఓడిపోయామని..వారు చెబితే...మరి ఈ సారి సొమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి..అన్న ప్రశ్న ఎదురయిందైట. దీంతో...తమకు ఉన్న ఆస్తులను తెగనమ్ముతున్నారట..'తోపుదుర్తి బ్రదర్స్‌'. అనంతపురం పట్టణం నడిబడ్డున ఉన్న సినిమా హాలును 40 కోట్ల రూపాయలకు 'తోపుదుర్తి బ్రదర్స్‌' అమ్మేసి ఎన్నికల కోసం సొమ్ములను రెడీ చేసుకుంటున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ సినిమా హాలును అమ్మేసారని సచివాలయంలో పనిచేస్తున్న 'రాయలసీమ'కు చెందిన ఉద్యోగులు  కొందరు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'  ప్రతినిధులతో చెప్పారు. ఎప్పుడో...రాజశేఖర్‌రెడ్డి సమయంలో 'హంద్రీ,నీవా కాలువల్లో వచ్చిన రూ.4కోట్ల పర్సెంటేజీతో ఆ సినిమా హాలును 'తోపుదుర్తి బ్రదర్స్‌' కొనుగోలు చేశారట. 

  పదేళ్ల క్రితం...పర్సెంటేజీలతో కొన్న సినిమా హాలు ఇప్పుడు రూ.40కోట్లకు అమ్ముడు పోవడం ఏమిటి..? అనంతపురం ఏమైనా...విజయవాడ లేక విశాఖపట్నం,హైదరాబాద్‌లో ఉందా..? ఏమి చెబుతున్నారని..మీడియా ప్రతినిధులు 'రాయలసీమ' ఉద్యోగులను ప్రశ్నించగా....అసలు..మీకేం..తెలుసు..? అనంతపురం సంగతి...? 'కియా' మోటార్స్‌ వచ్చిన తరువాత... విజయవాడ, విశాఖపట్నం,హైదరాబాద్‌ నగరాల కన్నా..తమ వద్దే భూములకు రేట్లు ఎక్కువ ఉన్నాయని..కావాలంటే వచ్చి పరిశీలించుకోవచ్చునని సచివాలయంలో పనిచేస్తోన్న 'అనంతపురం' వాసి ఒకరు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో వ్యాఖ్యానించారు. అంటే అప్పట్లో...'రాజన్న' దోపిడీ రాజ్యంలో దోచుకున్న నాలుగు కోట్లతో...సినిమా హాలు కొంటే...ఇప్పుడు 'చంద్రన్న' రాజ్యంలో రూ.40కోట్లు అయిందా..?అంటూ 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధి నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. సరే..ఎవరు ఔనన్నా.. కాదన్నా....'కియా' దెబ్బకు 'అనంతపురం' రూపు రేఖలు మారిపోయాయి..దానిలో అధికారపార్టీ, విపక్షాలకు చెందిన వారితో పాటు...ప్రజలూ లాభపడ్డారు. అయితే..వచ్చిన లాభాలను 'పాపం..తోపుదుర్తి బ్రదర్స్‌ 'జగన్‌' కోసం తెగనమ్ముతున్నారని...వారి సన్నిహితులు వాపోతున్నారట. మరి 'జగన్‌' అంటే ఏమనుకున్నారు..? సొమ్ములు లేకుండా...పోటీ చేయనిస్తారా..? ఏమి చేస్తాం..ఉన్నవరకు ఖర్చు చేస్తాం..ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నాం..గెలిస్తే..ఆనందం..లేకుంటే...'జగన్‌'కు నమస్కారం పెట్టి..మా వ్యాపారం..మేము చేసుకుంటామని...'తోపుదుర్తి' వారు అంటున్నారట. చూద్దాం..ఏమి జరుగుతుందో..?

(3613)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ