WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వంగవీటి'ని బుజ్జగిస్తున్న 'విజయసాయిరెడ్డి'...!?

కృష్ణా జిల్లా వైకాపా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి దాకా...పార్టీలో తాము చెప్పిన చోట టిక్కెట్‌ ఇస్తామని..అక్కడ పోటీ చేస్తే...చేయి...లేకపోతే..వెళ్లిపోవచ్చునని...'వంగవీటి రాధాకృష్ణ'కు చెప్పిన వైకాపా పెద్దలు ఇప్పుడు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నుంచి మాత్రమే తాను పోటీ చేస్తానని 'వంగవీటి రాధాకృష్ణ' చెప్పటం..దానికి అధినేత 'జగన్‌' అంగీకరించకపోవడంతో...ఆయన అలకపాన్పు ఎక్కారు. గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత నుంచే తాను 'సెంట్రల్‌'లో పోటీ చేస్తానని..ఇతర చోట చెయ్యనని చెప్పినా..అక్కడ 'విష్ణు'కు సీటు ఇస్తామని ప్రకటించడం దీనిపై 'రాధా' వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే...అప్పట్లో...'రాధా' వర్గీయుల ఆందోళనను అధినేత 'జగన్‌' పెద్దగా పట్టించుకోలేదు. తాను చెప్పినట్లు 'మచిలీపట్నం' పార్లమెంట్‌కు పోటీ చేయాలని...లేదంటే...ఎక్కడా టిక్కెట్‌ ఇచ్చేది లేదని..ఆయన ఖరాఖండిగా చెప్పడంతో...'రాధాకృష్ణ' తన భవిష్యత్‌పై అనుచరులతో గత కొన్నాళ్లుగా చర్చిస్తున్నారు. 

 'మచిలీపట్నం'లో పోటీ చేస్తే ఓటమి ఖాయమని..అక్కడ తనకు అంతగా పట్టుదలేదని, పైగా లోక్‌సభ పోటీ చేయాలంటే సొమ్ములు చాలా కావాలని..అవి తన వద్ద లేవని...భావిస్తోన్న 'రాధాకృష్ణ' అక్కడి నుంచి పోటీ చేయడం కంటే పార్టీ మారితే బాగుంటుందనే ఉద్దేశ్యంతోఉన్నారు. దీనికి ఆయన అనుచరులు కూడా మద్దతు ఇచ్చారు. అయితే..ఏ పార్టీలోకి మారాలనే దానిపై...వారు మల్లగుల్లాలు పడ్డారు. అధికార తెలుగుదేశంలోకి వెళితే...'వంగవీటి' కోరినట్లు 'సెంట్రల్‌' సీటు ఇస్తారనే హామీ ఉన్నా..ఆయన అనుచరుల్లో ఎక్కువ మంది...టిడిపిలోకి వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిసింది. దానికి ప్రత్యామ్నాయంగా... 'జనసేన'లోకి వెళదామని భావించినా...'పవన్‌' ఏం చేస్తారో తెలియదని..ఆయన రాజకీయాలు అంత సీరియస్‌గా లేవని..ఇటువంటి పరిస్థితుల్లో ఆ  పార్టీలోకి వెళ్లి చేసేదేముందన్న అభిప్రాయం 'రాధా'లో వ్యక్తమైందని ఆయన అనుచరులు చెబుతూ..పార్టీ మారే దానిపై ఎటువంటి స్పష్టతను ఇవ్వలేకపోయారు. ఈలోపు వైకాపా అధిష్టానం కూడా జిల్లాలో పోటీకి ఎవరూ ముందుకు రాకపోతుండడంతో...'రాధాకృష్ణ'ను బుజ్జగించాలని భావించిందని..దానిలో భాగంగా సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి'ని విజయవాడ పంపించారని తెలుస్తోంది. ఆయన ఈ రోజు 'రాధా'తో సమావేశమయ్యారని... 'మచిలీపట్నం' పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తే..గెలుస్తావని, ఆర్థిక విషయాలు 'జగన్‌' చూసుకుంటారని హామీ ఇచ్చారని, దీంతో...'రాధ' మెత్తపడ్డారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై 'రాధా' వర్గం ఏమీ మాట్లాడడం లేదు. తాము అడిగిన సీటు ఇవ్వకుండా...తమకు పట్టులేని చోట ఇస్తే..ఎలా అనే మీమాంస..వారిలో ఉంది. అయితే..పార్టీ మారే అవకాశాలు లేకపోవ డంతో..ఇచ్చిన చోట పోటీ చేసి..అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న భావనతో 'రాధాకృష్ణ' వర్గీయుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.!

(1306)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ