WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌'తో పొత్తుకు 'జగన్‌' నో...!?

తనపై పరోక్షంగా వాడివేడి విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తోన్న 'జనసేనాధిపతి' 'పవన్‌కళ్యాణ్‌'తో పొత్తు పెట్టుకోనే ప్రసక్తేలేదని..ఈ విషయంలో తనతో సంబంధం లేకుండా ఆ పార్టీతో చర్చించవద్దని..ఆయన పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారట. ఒకవైపు 'చంద్రబాబు'ను టార్గెట్‌ చేస్తూనే మరో వైపు 'పవన్‌'పై విమర్శలు చేయడంపై రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 'జగన్‌,పవన్‌'లను కలసి పోటీ చేయించాలని బిజెపి పెద్దలు భావిస్తున్న తరుణంలో 'పవన్‌'తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని 'జగన్‌' చెబుతుండడం..వారిని ఆశ్చర్యపోతోంది. తనకు పేపర్‌, టివి లేదని..ఇవన్నీ కావాలంటే 'జగన్‌'తో వెళ్లండి..అని 'పవన్‌' చెప్పారట. ఇప్పటికీ ఏదో ఒక విమర్శ 'జగన్‌'పై పవన్‌ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం..ఆయన కోరిన సీట్లు ఇవ్వలేం..పదేళ్ల క్రిందట జరిగిన ఎన్నికల్లో వచ్చిన సీట్లు 2014లో మనకు కొన్ని వచ్చాయి...?అప్పట్లో ద్వితీయ స్థానంలో ఉన్న సీట్లలో కూడా వైకాపా అభ్యర్థులు గెలిచారు..లేదంటే టిడిపి అభ్యర్థులు గెలిచారు..అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. గుర్తు పెట్టుకుని..పవన్‌కు రాజకీయ లబ్దిని చేకూర్చడం కంటే...ఒంటరిగా ముందుకు వెళదాం..అని 'జగన్‌' తేల్చి చెబుతున్నారు. 

  ఇటీవల విజయసాయిరెడ్డి పవన్‌తో రహస్య మంతనాలు జరిపినట్లు బయటకు పొక్కిన విషయం విదితమే. 'జగన్‌' ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరిపారా..? లేదా..ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు స్వయంగా కలిశారా..? అనే విషయం బయటపడడం లేదు. ఏది ఏమైనా 'జనసేనాధి'పతితో ముందు ముందు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయని వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు. వైకాపా ఓటు బ్యాంక్‌ 'జనసేన'కు లభించవచ్చు..కానీ..'జనసేన' ఓటు బ్యాంక్‌ వైకాపాకు బదిలీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 'పవన్‌' ఓటు బ్యాంక్‌ కేవలం కాపు యువజన ఓటర్లేనని వారు 'జనసేన' అభ్యర్థికి ఓటు వేస్తారే తప్ప..పొత్తు ఉన్నా వైకాపాకు ఓటు వేసే పరిస్థితి లేదని 'జగన్‌'కు తెలుసు. ఈ నేపథ్యంలో 'పవన్‌'తోపొత్తు కన్నా...అప్పటి పరిస్థితులను బట్టి  ఎన్నికల బరిలోకి దిగాలా..? ఎవరినైనా కలుపుకుపోవాలా..? అనే విషయంపై చర్చిద్దామని 'జగన్‌' నాయకులకు చెప్పినట్లు తెలిసింది.

(197)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ