WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోవూరు టిడిపి టిక్కెట్‌ పోలంరెడ్డికా...చేజెర్లకా...!?

నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు సమతూకం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరిని పోటీ చేయించాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే నాయకుని సూచనలు, ఆమోదంతోనే ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇది కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితం. అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు గత ముప్పయి సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుంటూ..పార్టీపై విమర్శలు చేయని వారినే పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈవిషయంలో మంత్రులు, ఇతర సీనియర్‌ నాయకుల ప్రమేయం ఉండదని కార్యకర్తలు నమ్ముతున్నారు. కోవూరు నియోజకవర్గం నుండి విజయం సాధించి ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడం, గ్రూపులు కట్టడం వంటి కారణాలతో ఆయనకు టిక్కెట్‌ ఇచ్చినా ఓడిపోవడం ఖాయమని నివేదిక రావడంతో ఆయనస్థానంలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారని స్థానిక నాయకులు చెబుతున్నారు. పార్టీలో ఆది నుండి కొనసాగుతూ చంద్రబాబుకు వీరవిధేయత చాటుతున్న జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చేజెర్ల వెంకటేశ్వరరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆర్థికపరంగా ఆయన తట్టుకోలేరని మంత్రి సోమిరెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం ఎంపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చూసుకుంటారు..? సోమిరెడ్డి కానీ..ఆయన అనుచరులు కానీ..వివాదాలు సృష్టించవద్దని కోవూరు స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2012 ఉప ఎన్నికల సందర్భంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆర్థికంగా శ్రీనివాసరెడ్డి సహాయం చేయడం జరిగింది. ఆయన ఎంత ఆర్థికంగా సహాయం చేశారో కానీ..అంతకు పదిరెట్లు ఈ నాలుగేళ్లలో సంపాదించుకున్నారనే పేరు కూడా వచ్చింది. అటువంటి నాయకుల్ని కోవూరులో పోటీ చేయించాలని సోమిరెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా సహాయం చేసిన వారికే ఆయన మద్దతు ఇస్తారా..? లేక పార్టీని నమ్ముకున్నవారికి మద్దతు ఇస్తారా..? ఒకప్పుడు 'చేజెర్ల' కూడా సోమిరెడ్డితో సన్నిహితంగా ఉండేవారే. కానీ ఆర్థికవనరులు ఆయనకు అంతంత మాత్రమే ఉండడంతో శ్రీనివాసరెడ్డిని చేరదీసినట్లు చెబుతున్నారు. కోవూరులో పార్టీ పరిస్థితి బాగుంటుడడంతో..అక్కడ పార్టీని చూసి ఓటు వేస్తారే కానీ..నోట్లు ఖర్చు పెట్టేవారికి ఓటు వేయరని సోమిరెడ్డికి అనుభవ పూర్వకంగా తెలుసు 2014 ఎన్నికల్లో చేజెర్లకు టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబు భావించినప్పటికి అప్పటి ఎంపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి 'పోలంరెడ్డి'ని ఎంపిక చేయించి గెలిపించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలంరెడ్డితో పోరాడిన అనుభవం టిడిపి నాయకులకు ఉంది. ఆయన కాంగ్రెస్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ..ఆయనపై ఎన్ని పోరాటాలు చేశాం..ఎన్ని బాధలు పడ్డాం..దురదృష్టం తమకు ఎదురై ఆయనను టిడిపి ఎమ్మెల్యేను చేసిందని స్థానిక నేతలు..చెబుతూనే ఉంటారు. పార్టీ కంచుకోటగా ఉన్న కోవూరులో పోలంరెడ్డిని మళ్లీ అభ్యర్థిగా ఎంపిక చేస్తే..వైకాపా అభ్యర్థి ఇంట్లో ఉన్నా విజయం సాధిస్తారని, అదే విధంగా శ్రీనివాసరెడ్డిని టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేస్తే..వైకాపా అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై విజయం సాధించలేరని, చేజర్లను ఎంపిక చేస్తే..స్థానిక నేతల సానుభూతితో విజయం సాధించగలరని స్థానిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎంతో కొంత ఖర్చు చేయగలిగిన స్థోమత 'చేజెర్ల'కు ఉందని..పార్టీ అధిష్టానం సహాయం చేస్తే..ఆదాల సహకరిస్తే..ఎలాంటి ఇబ్బందులు ఉండవని..స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై వ్యతిరేకత వ్యాఖ్యలు చేయవద్దని..పార్టీకి ఎవరు విధేయులో..ఎవరిని అవిధేయులో..వారిని పక్కన పెట్టి..పార్టీకి వీరవిధేయులైన వారిని ఎంపిక చేస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని కొవ్వూరు స్థానిక నేతలు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కోవూరు  ఎమ్మెల్యేకి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ పప్పులేం ఉడకువు..ముప్పయేళ్లు పార్టీలో ఉన్న చేజెర్ల వెంకటేశ్వరరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయండి..తామే ఓటర్లు దగ్గరకు వెళ్లి ప్రాధేయపడి గెలిపిస్తామని కార్యకర్తలు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో...విశ్వాసానికి పెద్దపీట వేస్తారా..? కార్యకర్తల వ్యతిరేకత ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తారా..? మంత్రి సోమిరెడ్డి ఒత్తిడికి తలగ్గుతారా..? వేచి చూడాల్సిందే.

(618)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ