WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లైంగిక వేధింపులు దురదృష్టకరం:అనసూయ

ఇప్పుడు దేశం మొత్తం 'మీాటూ'పై చర్చ జరుగుతోంది. పలువురు సెలబ్రిటీలు, మహిళా జర్నలిస్టుల, నటీమణులు తాము పనిచేసే చోట లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని పలువురిపై ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటి 'తనూశ్రీదత్తా', గాయని చిన్మయి,మహిళా జర్నలిస్టులు కొందరు తాము పనిచేసే చోట లైంగి వేధింపులను ఎదుర్కొన్నామని 'మీాటూ' అంటూ స్పందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి 'తనూశ్రీదత్తా' తనను టాలీవుడ్‌ యాక్టర్‌ నానా పటేకర్‌ రేప్‌ చేశారని ఫిర్యాదు చేసి సంచలనం సృష్టిస్తున్నారు. దక్షిణాదిలో గాయని 'తన్మయి' తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పడంతో..ఇప్పుడు తెలుగులో కూడా ఈ విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే 'శ్రీరెడ్డి' తనకు సినిమాల్లో అవకాశం కల్పించాలని కోరితే లైంగికంగా వాడుకున్నారని ఆరోపించడం..ఇప్పుడు భారీ స్థాయిలో 'మీాటూ' అంటూ పలువురు మహిళలు బయటకు రావడంతో..తెలుగులో మీరు కూడా ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నారా..? అని బుల్లితెర యాంకర్‌ 'అనసూయ'ను ప్రశ్నిస్తే...ఆమె చాలా తెలివిగా సమాధానం చెప్పింది. పనిచేసే చోట లైంగిక వేధింపులకు పాల్పడడం దురదృష్టకరం...లైంగిక వేధింపులు కేవలం నటులుకే కాదని చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు సాగుతున్నాయని..వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పనిచేసే చోట ధైర్యంగా ఉండడం, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉంటే లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవచ్చని 'అనసూయ' చెబుతోంది. తెలుగు సినీపరిశ్రమలో లైంగిక వేధింపులు తక్కువేనని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తం మీద...'అనసూయ' సినీపరిశ్రమలో లైంగిక వేధింపులున్నాయా..?అని ప్రశ్నిస్తే...డొంక తిరుగుడుగా సమాధానం చెప్పి తాను తెలివైందానినేనని నిరూపించుకుంది.  

(477)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ