WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆయుధం పట్టను...యుద్ధం చేయను:చంద్రబాబు

మహాభారతంలో రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధం అనివార్యమైంది. రాయబారాలు,బేరాలు కుదరక..యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. పాండవులు, కౌరవులు తమతో కలసి వచ్చే..బంధువులు, మిత్రులను కలుసుకుని తమ వైపు ఉండాలని..కోరుతున్నారు. దీనిలో భాగంగా..కృష్ణుడి వద్దకు అర్జునుడు, దుర్యోధనుడు వచ్చిన సంగతి తెలిసిందే కదా..! ముందుగా...తాను 'అర్జునుడి'ని చూశానని.. తన సైన్యం మొత్తం ఒక వైపు..తాను..ఒకవైపు ఉంటానని.. తాను మాత్రం యుద్ధం చేయను...ఆయుధం పట్టను..కృష్ణుడు షరతు పెడతాడు కదా..? 'అర్జునుడి'కి సైన్యం మొత్తం ధారబోయడానికి...కృష్ణుడు కపటనాటకం ఆడుతున్నాడని...అందుకే ముందుగా కోరుకునే వంతు 'అర్జునుడి'కి కృష్ణుడు ఇచ్చాడని...దుర్యోధనుడు మధనపడతాడు కదా...? ఆయుధం..పట్టకుండా...యుద్ధం చేయని 'కృష్ణుడి' కంచిగరుడ సేవ ఏమి చేసుకోవాలని దుర్యోధనుడు మదనపడతాడు కదా..? అయితే...కృష్ణ పరమాత్మ యుద్ధం చేయకున్నా..తమవైపు ఉంటే...తాము గెలుస్తామని తెలుసుకున్న 'అర్జునుడు' సైన్యం వద్దని...యుద్ధం చేయని కృష్ణుడినే కోరుకుంటాడు...కదా..ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ...ఇదే పరిస్థితి ఉంది. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా...తాను మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గనని...అంతా తమ పార్టీ నేతలే చూసుకుంటారని...తాను మాత్రం కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తానంటున్న 'చంద్రబాబు' వ్యూహం టిఆర్‌ఎస్‌ నేతలకు గుబులు పుట్టిస్తోందట.

  ఆయన ప్రచారం చేయనంటున్నారు..కానీ ఆయన 'అమరావతి' నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌,టిడిపి,సిపిఐలతో కలసి మహాకూటమి పేరుతో మాకు వణుకు పుట్టిస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూర్చోనే బూత్‌లెవల్‌లో ఏమి చేయాలో 'మహాకూటమి' అభ్యర్థులకు సూచనలు,సలహాలు ఇస్తున్నారు. రాష్ట్రంలోని పాత జిల్లాలను పట్టుకుని..ఎక్కడ ఎవరికి బలం ఉంది...ఎక్కడ ఎవరు అయితే..గెలుస్తారు..? ఏ పార్టీకి ఎంత మద్దతు ఉంది..? ప్రజల్లో పార్టీకి పట్టున్నా..ఓటింగ్‌కు తెచ్చుకోవడం ఎలా..? వారి చేత ఓట్లు ఎలా వేయించుకోవాలి..అనేదానిపై 'మహాకూటమి' అభ్యర్థులకు 'చంద్రబాబు' సూచనలు ఇస్తున్నారు. ప్రజల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టిఆర్‌ఎస్‌కు 'చంద్రబాబు' వ్యూహాలు అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అధికార పార్టీ ఇప్పటికే చేతులు ఎత్తేసిందని, నల్లగొండ,రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో సెటిలర్స్‌ ఉండే ప్రాంతాల్లో ఆ పార్టీ చాపచుట్టేస్తుందని...ప్రచారం జరుగుతోంది. అయితే ఇది వందశాతం జరగాలంటే...పైన పేర్కొన్న జిల్లాల్లో ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తెచ్చుకోవాలని...పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే... అంత సులువుగా 'మహాకూటమి' అభ్యర్థులువిజయం సాధిస్తారని 'చంద్రబాబు' 'రాహుల్‌గాంధీ'కి, టిడిపి స్థానిక నాయకులకు సలహాలు ఇస్తున్నారట. అత్యధికంగా సీట్లు కలిగిన హైదరాబాద్‌,రంగారెడ్డి,ఖమ్మం,మహబూబ్‌నగర్‌ల్లో పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌తో విజయంసాధ్యమవుతుందని..ఆ దిశగా చేయమని 'చంద్రబాబు' ప్రోత్సహిస్తున్నారట. చేసేది...కాంగ్రెస్‌ నాయకులు...చేయించేది... 'చంద్రబాబు' అన్నట్లుగా...తెలంగాణలో పోలింగ్‌ జరగబోతోంది. మహాభారతంలో కూడా అదే జరిగిది కదా....'యుద్ధం చేసేది 'అర్జునుడు'...చేయించింది...'కృష్ణుడే' కదా..ఏమంటారూ..!?

(307)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ