WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజకీయాల్లోకి 'వెంకయ్య' కుమారుడు..!?

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుమారుడు 'హర్షవర్థన్‌నాయుడు' రాజకీయాల్లోకి వస్తున్నారా...? ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేస్తారా..? అంటే అవుననే అంటున్నారు...బిజెపికి చెందిన సీనియర్‌ నేతలు కొందరు. ఇటీవల కాలంలో 'వెంకయ్య' కుమారుడు 'హర్షవర్ధన్‌నాయుడు' రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన కేంద్రంలోని బిజెపి పెద్దలను సమర్థిస్తూ...వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రానికి బిజెపి చాలా చేసిందని, ఇంకా చేస్తుందని...రాష్ట్ర పాలకుల వైఫల్యం వల్లే..రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని తన సన్నిహితుల వద్ద విమర్శలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి బిజెపి ఎన్నో మేళ్లు చేసిందని, ఇంత కన్నా ఇంకేమి ఇస్తారని..ఆయన బిజెపి నేతలను సమర్థిస్తున్నారట. ఇదేమిటి..? 'వెంకయ్య' కుమారుడై ఉండి..ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారా..? అనే దానిపై రాష్ట్ర రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్ర విభజన సమయంలో...ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందని..అప్పట్లో ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరించిన 'వెంకయ్య నాయుడు' పట్టుపట్టి...ఆంధ్రాకు ప్రత్యేకహోదా కావాలని పోరాడి...కేంద్రాన్ని ఒప్పించారు. తరువాత...హోదా విషయాన్ని బిజెపి పెద్దలు పక్కకు పెట్టినా...కేంద్ర మంత్రి హోదాలో తనకు ఉన్న పరపతితో 'వెంకయ్య' రాష్ట్రానికి చాలా సహాయం చేశారు. ఇది కాదనలేని నిజం. ఆయన కేంద్ర మంత్రిగా ఉంటే...ఆంధ్రా పరిస్థితి మరోలా ఉండేదేమో..కానీ...అప్పటికే కన్నుకుట్టిన 'మోడీ' ఆయనచే బలవంతంగా మంత్రి పదవికి రాజీనామా చేయించి...ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. దీంతో...రాజకీయాల్లో 'వెంకయ్య' పాత్ర ముగిసిపోయింది. అయితే...ఇప్పుడు ఆయన వారసుడు 'హర్షవర్దన్‌' రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారట. 

  వాస్తవానికి 'వెంకయ్య' కుమారుడు కానీ, కుమార్తె కానీ..రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు ఎప్పుడూ ప్రచారం కాలేదు. వారిలో కుమార్తె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ..తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. కుమారుడు వ్యాపారాలు చేస్తూ..బిజీగా ఉంటారనేది తెలిసిన విషయమే. తెలంగాణలో 'హర్షా' టయోటా ఇంకా ఇతర వ్యాపారాలు చేస్తున్న ఆయన సడన్‌గా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని...వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా..బిజెపిలో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ప్రధాని మోడీని, బిజెపిని ఆయన కీర్తిస్తున్నారట. అయితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన 'మోడీ'ని కీర్తిస్తే...రాష్ట్రం నుంచి నాయకుడిగా ఎలా ఎదుగుతారని కొందరు రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కాగా..'వెంకయ్య' పిఎస్‌గా పనిచేసిన 'సత్య' కూడా రాజకీయాలపై ఆసక్తితో ఉన్నారట. ఆయన వచ్చే ఎన్నికల్లో 'రాజంపేట' నుంచి పోటీ చేస్తానని..తనకు సీటు ఇప్పించాలని 'వెంకయ్య'పై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి కుమారుడినే రాజకీయాల్లోకి తేని...'వెంకయ్య' ఓఎస్‌డిగా పనిచేసిన 'సత్య'ను రాజకీయాల్లోకి తెస్తారా..? ఏమో చూడాలి మరి.

(2868)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ