WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎం రమేష్‌ ఇంటిపై ఐటి దాడులు...!

ముందు అనుకున్నట్లుగానే టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌ ఇంటిపై ఐటి దాడులు జరుగుతున్నాయి. కొందరు పాత్రికేయులు, రాజకీయనాయకులు ఊహించిన విధంగానే...ఆయన ఇంటిపై త్వరలో ఐటి దాడులు జరుగుతాయని..గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్న టిడిపికే చెందిన 'సుజనాచౌదరి' ఆస్తులపై దాడి చేసిన ఐటి అధికారులు..ఇప్పుడు మరో రాజ్యసభ సభ్యుడు 'సిపం రమేష్‌' ఇంటిపై దాడులకు దిగారు. ఏక కాలంలో దాదాపు 60 మంది అధికారులు ఆయన ఇంటికి సోదాలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు తమపై కేంద్ర పెద్దలు కక్ష కట్టారని..కక్షలో భాగంగానే...తమపై దాడులు చేస్తున్నారనే టిడిపి నాయకుల అభియోగాలను నిజం చేస్తూ...టిడిపికి చెందిన కీలక నేతల ఆళ్లపై, ఆస్తులపై, కార్యాలయపై ఐటి,ఈడీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది కీలక నాయకుల ఇళ్లపై ఐటి దాడులు జరిగే అవకాశం ఉంది.

(498)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ