WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పార్టీలో వ్యతిరేకత ఉన్న 'కంభంపాటి'కే మళ్లీ అధికారప్రతినిధి పదవి ఇస్తారా..?

గత 30 సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉంటూ...ఎక్కడ అధికారం ఉంటే...అక్కడ ఉండే 'కంభపాటి రామ్మోహన్‌రావు' గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌నని చెబుతుంటారు..కానీ...ఆయన ఐటిఐ చేశారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అప్పట్లో ఇంజనీరింగ్‌ చదివితే..ఆయన రూ.300లకు జీతానికి పనిచేస్తారా..? కంభంపాటి సన్నిహిత బంధువు ఒకరు ఉపేంద్ర వద్ద పనిచేసేవారు. ఆయన 'కంభంపాటి'ని ఉపేంద్రకు పరిచయం చేశారు. దీంతో ఆయన వ్యక్తిగత పనులు చేస్తూ..ఉపేంద్ర వద్ద స్థిరపడిపోయారు. అప్పట్లో ఎపి స్కూటర్‌ లిమిటెడ్‌ను కంభంపాటికి ఇప్పించి కూడా ఉపేంద్ర. అది సూపర్‌ప్లాప్‌ కావడంతో ఉపేంద్ర పార్లమెంట్‌బోర్డు ఛైర్మన్‌ కావడం, 1989లో కేంద్ర మంత్రి కావడంతో హీరోహోండా డీలర్‌షిప్‌ను 'కంభంపాటి'కి ఆయన కట్టబెట్టారు. రూ.300లతో జీవితాన్ని ప్రారంభించిన 'కంభంపాటి' ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. పిల్లికి బిచ్చం పెట్టరని ఆయనకు పేరుంది. గత ముప్పయి సంవత్సరాలుగా టిడిపిలో పనిచేసే కార్యకర్తలకు కానీ, సిబ్బందికి కానీ సహాయ,సహకారాలు చేసిన సంధర్బాలు లేవు. చివరకు లక్ష్మీపార్వతి పెత్తనం చేసేటప్పుడు కూడా కంభంపాటి ఎన్టీఆర్‌ వద్దే కనిపించేవారు. ఉపేంద్ర ప్రాభవం కోల్పోయిన తరువాత చంద్రబాబు, దగ్గుబాటి, లక్ష్మీపార్వతి ఈ విధంగా ఎవరు అధికారంలోకి ఉంటే వారి వెంటే 'కంభంపాటి' కనిపించేవారు. 1995లో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పుడు వైశ్రాయ్‌కు హోటల్‌కు వెళ్లగా అక్కడ ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు కంభంపాటిని తరిమితరిమి కొట్టారు. ఎందుకంటే ఆయన అప్పటికే 'లక్ష్మీపార్వతి' మనిషిగా ముద్రపడ్డారు. కానీ..ఒక పత్రికాధిపతిని ఏ విధంగా ఆకట్టుకున్నారో కానీ...రాజ్యసభ సిఫార్సు చేయించుకున్నారు. దీంతో ఆయన దిశ మరింతగా తిరిగింది. ఆపోస్టుతో వ్యాపారాలను పెంచుకున్నారు...అపరకుబేరుడయ్యారని పార్టీ నాయకులు చెబుతుంటారు. ఒకప్పుడు కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరితో సన్నిహితంగా మెలిగిన 'కంభంపాటి' ఆయన ద్వారా అనేక పనులు చక్కపెట్టుకుని..రెండోసారి ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వవద్దని చంద్రబాబుకు చెప్పి వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి తెచ్చారు. 

  రెండోసారి సుజనా రాజ్యసభ సభ్యత్వం దక్కడంతో..'కంభంపాటి' సంగతి తేల్చారు. ఆయనకు రెండోసారి ఆంధ్రప్రదేశ్‌ అధికార పోస్టు ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి తెరవెనుకకు నెట్టారు. అదుగో మళ్లీ ఆ పోస్టు తనకే వస్తుందని 'కంభంపాటి' ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఆయనకు ఆ పోస్టు దక్కలేదు..మరెవరికీ ఆ పోస్టు దక్కలేదు. ఇంతలో ఏమి జరిగిందో కానీ..మళ్లీ కంభంపాటిని ఢిల్లీలో అధికారపార్టీ ప్రతినిధిగా నియమించబోతున్నారని లీకులు వచ్చాయి. ఇంకేముంది..పత్రికలు ఆ వార్తను ప్రచారం చేశాయి. ఇది కావాలని 'కంభంపాటి' చేయించారా..? లేక చంద్రబాబు లీకులు ఇచ్చారా..? అనేది  మరో రెండు మూడు రోజులు గడిస్తే...కానీ తెలియదు. తమ కళ్ల ముందు దారిద్య్రాన్ని అనుభవించిన ఆయన ఇప్పుడు ఇన్ని వేలకోట్లు సంపాదించారంటే నమ్మశక్యంగా లేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. టిడిపి ద్వారా ఎంతో మంది సంపాదించుకున్నారు కానీ...కంభంపాటి వలే ఎవరికి కాలం కలసిరాలేదనేది స్పష్టమైంది. కేంద్రమంత్రిగా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఆయన ద్వారా 'కంభంపాటి' చాలా పనులు చక్కపెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. టిడిపి కేంద్ర కార్యాలయంలో కానీ, ఇతర చోట్ల కాని పనిచేసే వారు కానీ...కంభంపాటి పేరు చెబితే...ఒంటిపై తేళ్లు పాకినట్లు వ్యవహరిస్తుంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇళ్ల స్థలాలను ఇప్పిస్తానని హామీ ఇఛ్చి...తనకు పదవి దక్కడంతోనే వారిని పలకరించడమే తగ్గించారు. ఇన్ని అవలక్షణాలు ఉన్న 'కంభంపాటి'ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చేరతీస్తున్నారనే విషయం చాలా మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు అంతుబట్టడం లేదు. ప్రజల్లో పట్టున్న నాయకుడు కాదు..పార్టీలో పట్టులేదు..ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారనే పేరున్న 'కంభంపాటి'నిమళ్లీ ఢిల్లీలో నియమించబోతున్నారని బయటకు పొక్కడంతో నిత్యం చంద్రబాబుకు, లోక్‌ష్‌కు కనిపిస్తే..ఏదో ఒక పోస్టు లభిస్తుందని కంభంపాటి విషయంలో స్పష్టమైంది. ఇంతకీ 'కంభంపాటి'ని ఢిల్లీలో నియమిస్తారా..? లేక లీకింగ్‌లకే పరిమితం చేస్తారా..? మరో వారం రోజుల్లో అసలు విషయం బయటకు రానుంది.

(152)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ