లేటెస్ట్

'జెడి'గా...'కస్తూరి'కి ప్రమోషన్‌

సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న శ్రీమతి 'తెళ్లా కస్తూరీబాయి'కి జాయింట్‌ డైరెక్టర్‌గా ప్రమోషన్‌ లభించింది. ఇటీవల జరిగిన డిపిసి కమిటీ ఆమెకు ప్రమోషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. డీపీసీ నిర్ణయించినట్లు ఈ రోజు ఆమెను జాయింట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర సమాచారశాఖ  ఎక్స్‌అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎం.ఫ్రాన్సిన్‌ ఇటీవల రిటైర్‌ కావడంతో 'కస్తూరీబాయి'ని ఆయన స్థానంలో జెడిగా నియమించారు. కష్టించి పనిచేసే అధికారిణిగా పేరు తెచ్చుకున్న 'కస్తూరి' జర్నలిస్టులతో, తన సహచరులు, సిబ్బందితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్‌ డిపిఆర్‌ఒగా ఆమె పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్నాళ్లు డీజీపీ పిఆర్‌ఒగానూ, జిఎంసిహెచ్‌ పీఆర్‌ఒగానూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మీడియా సెల్‌లోనూ పనిచేసి మీడియా వారితో శభాష్‌ అనిపించుకున్నారు.  

ఇటీవల వరకు అమరావతి మీడియా సెల్‌లో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.  నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె రాష్ట్ర సమాచారశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. అధికారులు అప్ప చెప్పిన పనిని ఆగమేఘాలపై పూర్తి చేస్తారనే పేరు ఆమెకు ఉంది. తన వద్ద పనిచేసే వారితో పాటు, శాఖలోని ఇతర అధికారులు, సహచరులతో ఆమె స్నేహపూర్వకంగా పనిచేస్తారు. తన పైఅధికారుల మాటను తూ.చా తప్పకుండా పాటిస్తూశాఖ పనితీరును మెరుగుపర్చడంలో ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. వాస్తవానికి ఆమెకు ఎప్పుడో 'జెడి'గా ప్రమోషన్‌ రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన వల్ల కొంత కాలం ప్రమోషన్‌ ఆగిపోగా, గత ప్రభుత్వంలో ఆమెకు ప్రమోషన్‌ రాకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. సమర్థురాలైన అధికారిగా పేరు తెచ్చుకున్న 'కస్తూరి' సేవలను అప్పటి ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోకపోగా ఆమెపై కక్షపూరితంగా వ్యవహరించింది. కష్టపడే అధికారిణిగా, అందరితో స్నేహపూరితంగా వ్యవహరించే 'కస్తూరి'కి ప్రమోషన్‌ రావడంపై సమాచారశాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరం రాబోతున్న తరుణంలో 'కస్తూరి'కి ప్రభుత్వం ముందుగానే నూతన సంవత్సర కానుకను అందించింది. 

(715)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ