లేటెస్ట్

‘ఉత్తరాంధ్ర’పై వైకాపా ఆశలు హుష్‌కాకి...!

నిన్న మొన్నటి వరకూ..రాజధానిని ‘ఉత్తరాంధ్ర’కు తెస్తున్నామని, అమరావతిలో ఉన్న రాజధాని ‘ఉత్తరాంధ్ర’కు తీసుకువస్తే..అక్కడి ప్రజలు ఎంతోసంతోషపడి తమకు ఓట్ల వర్షం కురిపిస్తారని ఆశించిన వైకాపా నేతలకు..‘యువగళం’ సభతో షాక్‌ తగిలింది. టిడిపి ప్రధాన కార్యదర్శి ‘నారా లోకేష్‌’ నిర్వహించిన సుధీర్ఘ పాదయాత్ర తరువాత నిర్వహించిన బహిరంగ సభ నభూతో..నభవిష్యత్‌...అన్నట్లు..సూపర్‌ హిట్‌ కావడం..వైకాపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టిడిపి,జనసేన పార్టీలు రెండూ కలిసి నిర్వహించిన ఈ సభకు ప్రజలు సునామీలా తరలి వచ్చారు. సభా ప్రాంగణం నుంచి ఎటువైపు చూసినా, కనుచూపు ఎంత దూరం వెళుతుందో..అంత దూరం..జనప్రవాహమే. ఎక్కడ చూసినా..జనమే..జనం. యువగళం సభకు ఈ రీతిలో ‘జనం’ పోటెత్తుతారని టిడిపి, జనసేనలు కూడా ఊహించలేదు. ప్రజల్లో వైకాపాపై ఉన్న వ్యతిరేకతకు ఈ సభే నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టిడిపి వ్యూహాత్మకంగా ‘ఉత్తరాంధ్ర’లో భారీ సభను నిర్వహించడం, దానికి ప్రజలు లక్షలాదిగా తరలిరావడం..వైకాపా నేతలను, ఆ పార్టీకార్యకర్తలను, సానుభూతిపరులను నిశ్చేష్టులను చేసింది. తాము..ఉత్తరాంధ్రను రాజధానిని చేస్తున్నామని చెప్పుకుంటున్నా..తమకు ప్రజల నుంచి సరైన స్పందన లభించడం లేదని, కానీ టిడిపి నిర్వహించిన సభకు లక్షలాది మంది స్వచ్ఛంధంగా తరలిరావడం వారిని నివ్వెర సరుస్తోంది. ఎన్నికలప్పటికి తమకు మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత కనిపించినా..ఉత్తరాంధ్రలో కనిపించదని వారు బలంగా నమ్మారు. అయితే..వారి ఆశలను ‘యువగళం’ సభ అడియాసలను చేసింది. ఉత్తరాంధ్రను రాజధాని చేసినా, ఇంకా..అభివృద్ది చేస్తామనే వాగ్ధానాలు చేసినా..వైకాపాను ప్రజలు నమ్మరని..ఈ సభ ద్వారా వారికి అర్థం అయింది. ఇప్పటి దాకా వారు ఈ ప్రాంతంపై పెట్టుకున్న ఆశలు హష్‌కాకి అయ్యాయనే చెప్పాలి. కాగా..టిడిపి, జనసేన అగ్రనేతలు పొత్తు పెట్టుకున్నా..క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు కలిసి పనిచేయరని, వారి మధ్య విభేదాలను సృష్టిస్తే వారు..పొత్తు పెట్టుకున్నా ఓట్లు ట్రాన్స్‌ఫర్‌ కావని వైకాపా నేతలు ఇప్పటి వరకూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే..ఈ రోజు జరిగిన సభకు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు,సానుభూతిపరులు దిగ్విజయంగా కలిసి పనిచేసి సభను భారీగా విజయవంతం చేశారు. అదే విధంగా సభలో ప్రసంగించిన టిడిపి నాయకులు, జనసేన నాయకులు పొత్తు ధర్మాన్ని తాము నిక్కచ్చిగా పాటిస్తామని, ఎటువంటి అపోహలు దరిలేకుండా వ్యవహరిస్తామనే భావనను కలిగించారు. వారి భాష, వ్యవహారశైలి, ప్రసంగాల తీరు...ఈ పొత్తు ఇప్పుడే కాదు..మరింత కాలం ఉంటుందన్న సంకేతాలను ప్రజల్లోకి గట్టిగా పంపించగలిగారు. మొత్తం మీద..ఉత్తరాంధ్రపై వైకాపా నాయకులు పెట్టుకున్న ఆశలను ‘యువగళం’ సభ వమ్ము చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ