లేటెస్ట్

జర్నలిస్టులకు ఫ్రీ ఎసీ బస్‌పాస్‌లు కట్‌...!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఇచ్చే బస్సు పాస్సుల్లో ఈసారి కొన్ని మార్పులు చేసింది. మొన్నటి వరకు రాష్ట్ర స్థాయిలో సమాచారశాఖ నుంచి విడుదల చేసే అక్రిడిటేషన్లకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని సర్వీసులకు ఫ్రీ పాస్‌లు ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో అన్ని సర్వీసులకు 1/3 వసూలు చేసేది. అయితే నూతన సంవత్సరంలో ఎపిఎస్‌ఆర్టీసీ కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో జర్నలిస్టులకు ఇచ్చే ఫ్రీ పాస్‌లు కేవలం నాన్‌ ఎసీ సర్వీసులకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లా స్థాయిలో ఏసీ బస్సుల్లో జర్నలిస్టు పాస్‌లు చెల్లవని నూతనంగా విడుదల చేసిన పాస్‌ల్లో పేర్కొంది. ఇప్పటి వరకు ఐ&పిర్‌ అక్రిడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులకు రాజధానిపరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆర్టీసీ అన్ని సర్వీసుల్లో ఫ్రీ పాస్‌లు ఇవ్వగా..ఈసారి మాత్రం ఏసీ సర్వీసులను మినహాయించింది. అయితే గతంలో ఉన్నట్లు ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 1/3ను కొనసాగిస్తూ..వాటికి యధావిధిగా ఏసీ బస్‌ పాస్‌లను కొనసాగిస్తోంది. 

(579)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ