లేటెస్ట్

మాచర్ల ఎమ్మెల్యే కారుపై రైతుల దాడి...!

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారుపై రైతులు దాడి చేశారు. జాతీయ రహదారిని దిగ్బందిస్తూ రైతులు ఉదయం నుంచి నిరసన, ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమం నుంచి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి వాహనం వెళ్లడంతో రైతులు ఒక్కసారిగా ఆయన వాహనం చుట్టుముట్టారు. అయితే వాహనాన్ని ఆపకుండా రామకృష్ణారెడ్డి ముందుకు వెళ్లడంతో..రైతులు ఒక్కసారిగా దాడికి దిగారు. వాహనంపై రాళ్లు వేస్తూ..దాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు ఎటువంటి గాయాలు కాలేదు. రైతులపై కారును పోనివ్వడమే దాడికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఉదయం నుంచి శాంతియుతంగా సాగుతున్న ఆందోళన ఒక్కసారికి హింసాత్మకంగా మారింది. 

(412)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ