లేటెస్ట్

రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

రాజధాని తరలిపోతుందని, తద్వారా తన కుటుంబానికి ఉపాధిలేకుండా పోతుందనే ఆందోళనతో 'వేమూరి గోపి' అనే రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులుచెబుతున్నారు. రాజధానిలో 'గోపి' రైతు కూలీగా పనిచేస్తున్నాడని, ఆయన ట్రాక్టర్‌ డ్రైవర్‌గా ఉన్నాడని వారు చెబుతున్నారు. రాజధానిని తరలించవద్దని గత 24 రోజులుగా ఇక్కడ ఆందోళన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని తరలిపోతుందనే భయంతో, తనకు, తన కుటుంబానికి ఇక ఉపాధి లభించదనే బెంగతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు రోదిస్తూ చెబుతున్నారు. ఇప్పటికే రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో పలువురు రైతులు గుండెపోటుతో మరణించగా, తాజాగా 'గోపి' ఆత్మహత్య చేసుకోవడం రాజధాని ప్రాంత వాసులను కలచివేస్తోంది. 

(330)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ