లేటెస్ట్

'పులివెందుల'లో రాజధాని పెట్టుకోండి:రాయపాటి

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాజధానిని తరలించాలనుకుంటే 'పులివెందుల'లో పెట్టుకోవాలని, అంతే కానీ...మూడు రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సిఎంకు సూచించారు. ఆయన సోమవారం నాడు టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.పస్‌.జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన హాస్యాస్పదమని, ఆయన తీరు సరికాదని, రాజధాని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తోన్న దీక్షలకు ఆయన సంఘీభావం తెలుపుతూ..రైతులు అధైర్యపడవద్దని, రాజధానిని తరలించడం సాధ్యం కాదని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'మోడీ'తో విభేదాలు పెట్టుకున్నారని, దీని వల్ల చాలా నష్టం జరిగిందని ఆయన అన్నారు. 'మోడీ'తో 'చంద్రబాబు' ఢీ కొనకపోతే...పరిస్థితి వేరే విధంగా ఉండేదని, రాబోయే ఎన్నికల్లో టిడిపి,బిజెపి, జనసేనలు కలిసిపోటీ చేస్తాయని, వచ్చే ఎన్నికల్లో గెలిచి 'చంద్రబాబు' ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న పోరాటాలను ఆపవద్దని, ఎవరూ అధైర్యపడవద్దని, పోలీసులతీరుపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తోన్న పోరాటం అపూర్వమని వారి పోరాటానికి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.

(415)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ