లేటెస్ట్

రాజధాని రైతులకు రెండు లక్షల కోట్ల పరిహారం

మార్కెట్‌ రేట్‌ ప్రకారం గజానికి రూ.5వేలు
33,771 ఎకరాలకు రూ.1,89,117లక్షల కోట్లు
ఇతర స్టేక్‌హోల్డర్స్‌కు రూ.2లక్షల కోట్లు 
మొత్తం 4లక్షల కోట్ల పరిహారం
సిఎంకు లేఖలో వివరించిన ఎంపి 'సుజనా'

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని 'అమరావతి'ని మారిస్తే...ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు దాదాపు రెండు లక్షల కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని బిజెపి ఎంపి 'సుజనాచౌదరి' పేర్కొన్నారు. రైతులతో పాటు ఇతర రాజధాని భాగస్వాములకు చెల్లించాల్సింది మరో రెండు లక్షల కోట్లు ఉంటుందని మొత్తం కలిపి నాలుగు లక్షల కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చినప్పుడు వారితో ఒప్పందం చేసుకున్నామని, ప్రస్తుతం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం 'విశాఖ'లో రాజధానిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని, దీనితో రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన ఆ లేఖలో వివరించారు. ఒక్కో ఎకరానికి 4480 చ.గజాలు భూమిని రైతులకు ప్రభుత్వం ప్లాట్‌ల కింద ఇచ్చిందని, ఇప్పుడు గజానికి మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం రూ.5000/- చొప్పున రూ.2.24కోట్లు అవుతుందని పేర్కొన్నారు.  మొత్తం 33,771 ఎకరాలకు మార్కెట్‌ రేటు ప్రకారం రూ.1,89,117లక్షల కోట్లు అవుతుందని, దీనికి 12% వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని 'చౌదరి' తన లేఖలో పేర్కొన్నారు. వీరు కాకుండా రాజధానిలో భాగస్వాములైన వారికి, రాజధాని బాండ్లు కొనుగోలు చేసిన వారికి, కాంట్రాక్టర్స్‌కు కలిపి మరో రెండు లక్షల కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే ఉన్న పరిస్థితుల్లో 4లక్షల కోట్లు ఎక్కడ నుంచి తెచ్చి వారికి చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. 

(785)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ