లేటెస్ట్

'ఆ ఐఎఎస్‌ సిఎంఒ వైపు వెళ్లడం లేదట...!

ఆయనో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగారు. 'చంద్రబాబు' ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి మంచి శాఖనే కట్టబెట్టారు. ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి వైకాపా అధికారంలోకి వచ్చినా సదరు ఐఎఎస్‌ అధికారికి మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. గతంలో 'చంద్రబాబు' ఇచ్చిన ప్రాధాన్యత కన్నా 'జగన్‌' ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఓ శాఖాధిపతిగా నియమించారు. దీంతో గతంలో కంటే హుషారుగా సదరు ఐఎఎస్‌ అధికారి పనిచేస్తున్నారట. అయితే ఇటీవల మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన తరువాత..ఆ అధికారి అనుకోకుండా చిక్కుల్లో పడ్డారు. మూడు రాజధానులపై నియమించిన కమిటీ రిపోర్టు  విడుదల సందర్భంగా అంతా తానై వ్యవహరించిన సదరు అధికారిపై ప్రతిపక్షనేత 'చంద్రబాబునాయుడు' ధ్వజమెత్తారు. మూడు రాజధానుల రిపోర్టును గంటలోనే సదరు ఐఎఎస్‌ అధికారి చదివి ఎలా చెబుతారని, ఆయనేమన్నా పైనుంచి దిగివచ్చారా..? అని ప్రశ్నించారు. అంతే కాకుండా..ఈ సందర్భంగా సదరు ఐఎఎస్‌ అధికారిని ప్రతిపక్షనేత 'చంద్రబాబు' అగౌరవంగా సంభోదించారని ప్రచారం జరిగింది. దీనిపై కొన్ని దళిత సంఘాలు..తీవ్ర స్థాయిలో ఆయనపై ధ్వజమెత్తాయి. దళిత ఐఎఎస్‌ అధికారిని దూషించిన 'చంద్రబాబు'పై కేసులు పెట్టాలని వారు తీర్మానించారు. దీనికి ప్రభుత్వం కూడా సై అంది. దీంతో ఇక 'చంద్రబాబు'పై నేడో..రేపో కేసు నమోదు అవుతుందని భావించినా..సదరు ఐఎఎస్‌ అధికారి మాత్రం 'చంద్రబాబు'పై కేసు నమోదు చేయించేందుకు అంతగా ఇష్టపడలేదట. ఎందుకొచ్చిన గొడవ అనో...? లేక..గతంలో తనకు ప్రాధాన్యత ఇచ్చారనో..లేక..పొరపాటున 'చంద్రబాబు' మాట జారడానో..ఏమైనా కానీ...కేసు నమోదు చేయించేందుకు అంగీకరించలేదట. ఆయన మౌనంగా ఉండడంతో సిఎంఒ అధికారులు...దీనిపై సదరు ఐఎఎస్‌ ఐఎఎస్‌ అధికారిని ప్రశ్నించారట. ఎప్పుడు 'చంద్రబాబు'పై కేసు నమోదు చేయిస్తున్నారు..? అయితే కేసు పెట్టే ఉద్దేశ్యం లేకపోవడంతో..ఆయన అప్పటి నుంచి సిఎంఒ వైపు తొంగి చూడడం లేదట. ఒకవేళ సిఎంఒ వైపు వెళితే..దీని గురించి వారు ప్రశ్నిస్తారనే భావనతో ఆయన అటువైపు తొంగి చూడడం లేదట. తన పనితాను చేసుకుంటూ పోవాలని, అనవసర వివాదాలను ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో సదరు ఐఎఎస్‌ అధికారి ఉన్నారట. 

(576)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ