లేటెస్ట్

'ఆంధ్రా' అయిపోయింది..ఇక 'తమిళనాడు' సంగతి తేల్చనున్న 'పికె'...!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త 'ప్రశాంత్‌ కిశోర్‌'ను 'డిఎంకె' పార్టీ తన వ్యూహకర్తగా నియమించుకుంది. ఈ విషయాన్ని 'ప్రశాంత్‌ కిశోర్‌' టీమ్‌ ఐ-ప్యాక్‌ ట్విట్టర్‌లో ప్రకటించగా, అది నిజమేనని 'డిఎంకె' అధ్యక్షుడు 'స్టాలిన్‌' ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2021లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం 'ప్రశాంత్‌కిశోర్‌' సేవలను 'డిఎంకె' పార్టీ వినియోగించుకోనుంది. నవ యువకులతో కూడిన ఐ-ప్యాక్‌ టీమ్‌తో పనిచేయడానికి తాను సంతోషిస్తున్నానని, వారితో కలిసి పనిచేసి నూతన తమిళనాడును నిర్మిస్తామని 'స్టాలిన్‌' తెలిపారు. 

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో 'ఆంధ్రా'లో వైకాపా 'ప్రశాంత్‌కిశోర్‌' టీమ్‌ సేవలను వినియోగించుకున్నారు. 'పికె' వల్లే వైకాపా గెలిచిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సామాజికవర్గాల ప్రభావాన్ని విశ్లేషించి, వారిని పార్టీకి అనుకూలంగా ఎలా మలచుకోవాలి..? తద్వారా ప్రత్యర్థులను ఎలా బోల్తా కొట్టించవచ్చో 'ఆంధ్రా'లో 'పికె' చేసి చూపించారు. ఆయన వల్లే గెలవాల్సిన 'చంద్రబాబు' ఓడిపోయారని, ప్రముఖ దినపత్రిక ఎండి 'రాధాకృష్ణ' తన వ్యాసంలో పేర్కొన్నారు. 'కమ్మ' కులంపై 'పికె' ఇతర కులాలను రెచ్చగొట్టారని, తద్వారా మిగతా కులాల ఓట్లు వైకాపాకు మళ్లించే విధంగా వ్యూహాన్ని రూపొందించి వైకాపా గెలవడానికి కృషి చేశారని రాశారు. కులాల మధ్య విధ్వేషాలు రెచ్చిగొట్టి 'పికె' తాను ఒప్పందం కుదుర్చుకున్న పార్టీలకు మేలు చేస్తున్నారనే అభిప్రాయం..రాజకీయ వర్గాల్లో ఉంది.

 ఆయన సమాజంలో విద్వేషాలను పెంచిపోషిస్తున్నారని, ఇటువంటి వారిపై నిషేదం విధించాలని కొన్ని స్వచ్చంధ సంస్థలు అంటున్నాయి. 'ఆంధ్రా'లో 'పికె' సృష్టించిన విధ్వేషాలు ఇంకా ప్రజల మనస్సుల్లోంచి చెరిగిపోలేదని, ఇప్పుడు ఆయన తమిళనాడు లో ఇటువంటి చర్యలకు పాల్పడబోతున్నారని వారు విమర్శిస్తున్నారు. కాగా..తమిళనాడులో 'జయలలిత' మరణం తరువాత బలహీనపడ్డ 'అన్నాడిఎంకె'ను ఓడించడానికి 'డిఎంకె' 'ప్రశాంత్‌కిశోర్‌'పై ఆధారపడడంపై రాజకీయ పరిశీలకుల్లో పలు ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో 'అన్నాడిఎంకె'కు ఒక్క ఎంపి సీటు కూడా రాలేదని, అటువంటి పార్టీపై గెలవడానికి 'ప్రశాంత్‌కిశోర్‌' అవసరమా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే 'అన్నాడిఎంకె' వెనుక బిజెపి ఉందని, పోటీ మోడీ, అమిత్‌షాతో అని అందుకే 'స్టాలిన్‌' 'పికె'తో జతకట్టారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

(862)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ