లేటెస్ట్

‘రాయిటర్స్‌’పై కేసు పెడతారా...!?

ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ప్రభుత్వానికి గురువారం నాడు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘రాయిటర్స్‌’ సంస్థ చెమటలు పట్టించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ ‘కియా’ ‘తమిళనాడు’కు వెళ్లబోతోందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానా వల్లే ఆ సంస్థ ‘ఆంధ్రా’ నుంచి తమిళనాడు వెళ్లాని భావిస్తోందని, ప్రభుత్వ విధానాల వ‌ల్లే ‘కియా’తో పాటు వివిధ అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఇబ్బందు పడుతున్నాయని ‘రాయిటర్స్‌’ రాసింది. ఈ వార్త రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ సంచల‌నం సృష్టించింది. ఇప్పటికే పీపీఏ రద్దుతో అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాగా, తాజాగా ‘రాయిటర్స్‌’ రాసిన ‘కియా’వార్తతో ప్రభుత్వ ప్రతిష్ట మరింతగా దిగజార్చింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా నష్ట నివారణ చర్యల‌కు దిగారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ‘రజత్‌భార్గవ’తో దీనిపై ఖండన ఇప్పించారు. అనంతరం ‘కియా’ సంస్థతోనూ అలాంటి ఖండనే విడుదల‌ చేయించారు. తరువాత రాష్ట్ర ఆర్థిక మంత్రి ‘బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి’ రంగంలోకి దిగి ‘కియా’ ఎక్కడికి పోదని, ఆ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీల‌ను ఇస్తామని ప్రకటించారు. మరో వైపు పార్లమెంట్‌ సమావేశాల్లో టిడిపి ఎంపీలు దీనిపై ప్రస్తావించగా వైకాపా ఎంపీలు ఖండన ఇచ్చారు. ‘కియా’ సంస్థపై ‘టిడిపి’ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శులు గుప్పించారు. ఇంకో వైపు ‘అనంతపురం’ ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్పందిస్తూ ‘కియా’ ఇక్కడే ఉంటుందని, ఆ సంస్థకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బంది ఇక్కడ ల‌భించకపోతే...వేరే చోటి నుంచి తెచ్చుకోవచ్చని తెలిపారు. ఇక సిఎంఒ స్థాయిలో దీనిపై వరుసగా ఖండల‌ను ఇస్తూ వచ్చారు తప్ప..ఏ ఒక్కరూ..అది తప్పుడు వార్త అని కాని, అసత్య వార్త అని కానీ చెప్పడంలేదు. ఒక వేళ అది అసత్య వార్త అయితే దానిపై పరువు నష్టం కేసుతో పాటు..క్రిమినల్‌ కేసును కూడా నమోదు చేస్తామని పేర్కొనలేదు. ఇటీవల‌ వైకాపా ప్రభుత్వం తప్పుడు వార్తలు, అసత్య వార్తలు రాస్తే విలేకరుల‌పై కేసు పెడతామని హెచ్చరించారు. మరి..‘రాయిటర్స్‌’ సంస్థ రాసిన వార్త నిజం కాకపోతే...ఆ సంస్థపై కేసు పెడతామని ఎందుకు ప్రకటించలేదు? రాష్ట్ర ప్రభుత్వ పరువును అంతర్జాతీయంగా తీసిన ‘రాయిటర్స్‌’ సంస్థపై కేసు నమోదు చేసి తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామ‌ని నిరూపించుకోవాల‌ని కొంతమంది మీడియా మిత్రులు ప్రభుత్వానికి సల‌హా ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఆ సంస్థపై కేసులు నమోదు చేస్తుందా...? లేక ఖండను ఇచ్చి చేతులు దులుపుకుంటుందా..? చూద్దాం..పచ్చమీడియాపై కత్తులు నూరే వైకాపా ప్రభుత్వం...అంతర్జాతీయ మీడియాపై కూడా ఇదే విధంగా కత్తులు ఠ‌ళిపిస్తే...బాగుంటుంది కదా...? 

(787)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ