లేటెస్ట్

‘చంద్రబాబు’ మాజీ పిఎస్‌ శ్రీనివాస్‌ ఇంటిలో ఐటీ సోదాలు...!

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు ‘నారా చంద్రబాబునాయుడు’ మాజీ పిఎస్‌ శ్రీనివాస్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. విజయవాడ, హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు రావడంతో ఆయనపై ఐటీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.2019 ఎన్నికల‌ వరకు ‘శ్రీనివాస్‌’ ‘చంద్రబాబు’ పిఎస్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ‘శ్రీనివాస్‌’ ‘చంద్రబాబు’ వద్ద సుధీర్ఘకాలం పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తరువాత..ఆయన ‘జీఎడి’లో పనిచేస్తున్నారు. ‘చంద్రబాబు’ తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శ్రీనివాస్‌’ ఆయన కార్యదర్శి వద్ద ‘పిఎ’గా చేరారు. తరువాత కాలంలో ఆయన ‘చంద్రబాబు’ వద్ద పిఎగా పనిచేశారు. అప్పటి నుంచి ఇటీవల‌ ఎన్నిక వరకు ‘శ్రీనివాస్‌’ ఆయనను అంటిపెట్టుకునే ఉన్నారు. 2004,2009ల్లో టిడిపి ఓడిపోయినా ‘చంద్రబాబు’ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడంతో ఆయన వద్దే ‘శ్రీనివాస్‌’ పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నిక్లో టిడిపి గెలిచిన తరువాత ఆయన హవా బాగా సాగిందని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ఐదేళ్లలో ఆయన పలుపైరవీలు చేశారని, దీనిపై ‘చంద్రబాబు’కు ఫిర్యాదులొచ్చాయి. దీంతో..ఆయనను తన వద్ద నుంచి అప్పట్లో పంపేశారు. అయితే మళ్లీ ఏమైందో కానీ...కొన్ని రోజుల‌ తరువాత..ఆయన తిరిగి ‘చంద్రబాబు’ వద్దకు వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ‘శ్రీనివాస్‌’ ‘చంద్రబాబు’ను వదిలేశారు. అప్పట్లో క్రియాశీకంగా వ్యవహరించిన ‘శ్రీనివాస్‌’పై ఇప్పుడుఐటీ దాడు జరగడం గమనార్హం. 

(607)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ