WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శాంతి చర్చల కోసం...ఆరు వేల మంది నగ్నంగా...ఫోటోలు..

కొలొంబియాలోని లెఫ్టిస్ట్‌ తిరుగుబాటుదారులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరుకుంటూ ఆ దేశానికి చెందిన ఆరు వేల మంది సామూహికంగా నగ్న ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. శాంతి కోసం నగ్నంగా మారడం సంతోషంగా ఉందని, మేమంతా గర్వాన్ని పక్కనబెట్టి మౌనంగా, శాంతిగా ఉండాలని నిర్ణయించుకున్నాం, ఇది యూనిటీకి చిహ్నంగా ఉంటుందని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన బెర్రియాంటౌస్‌(40) తెలిపారు. ఇది నిజంగా కొత్త అనుభవం, మనం ప్రపంచంలోకి ఎలా వస్తామో..అలాగే ఫోటో సెషన్‌లో పాల్గొన్నాం అని బెల్ట్రాన్‌(20) తెలిపారు. మనుషులను సామూహికంగా నగ్న చిత్రాలు తీయడంలో నేర్పరి అయిన అమెరికన్‌ ఫోటోగ్రఫర్‌ స్పెన్సర్‌ ట్యూనిక్‌ ఈ ఫోటోలను తీశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఒంటిపై నూలు పోగు లేకుండా వస్త్రాలన్నింటిని విప్పేశారు. శాంతి కోసం ఇలాంటి కార్యక్రమం జరగడం విశేషమని, ప్రభుత్వం ఇప్పటికైనా శాంతి చర్చలపై కార్యాచరణ ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఫోటోగ్రాఫర్‌ ట్యూనిక్‌.

(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ