లేటెస్ట్

కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి నెల్లూరు మెడికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. చెన్నైకి తరలించే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు.


 ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో కత్తి మహేశ్ తలకి తీవ్రగాయాలయినట్లు సమాచారం.కాగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదరిపై మహేశ్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు... శనివారం ఉదయం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను నెల్లూరు మెడికేర్ హాస్పిటల్‌కు తరలించారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ