ఇద్దరు చెల్లెలు-ఇద్దరు అన్నలు...!
అన్నాచెల్లెల బందం... అనురాగానికి, అప్యాయతలకు చిరునామా. అన్న కోసం చెల్లెలు...చెల్లిల కోసం అన్న ప్రాణత్యాగాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. చెల్లెలి కోర్కెలను తీర్చడం కోసం సర్వ ఆస్తులు దారబోసిన అన్నలు, తమ్ముళ్లు ఎందరో ఉన్నారు. అలాగే అన్న సంక్షేమం కోసం చెల్లెలు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సమాజంలో అన్నాచెల్లెళ్ల బంధానికి ఎంతో విలువిస్తారు. అయితే..ఇప్పుడు రాజకీయంగా కొందరు అన్నలు...చెల్లెలు..ఒకరిపై ఒకరు శత్రుత్వాన్ని పెంచుకుని..ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. రాజకీయ అధికారం కోసం..పదవుల కోసం, సొమ్ముల కోసం అన్నాచెల్లెల బంధాన్ని కాదని హోరాహోరిగా పోరాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల్లోని అన్నాచెల్లెళ్ల పోరును చూసిన వారు..ఔరా...సొమ్ములు, పదవులు ఎంత పనిచేస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రలు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబం, కె.చంద్రశేఖర్‌రావు కుటుంబాలు గురించి తెలియనవారు ఉండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయగా...తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే..ఈ ఇద్దరు నేతలూ తమ వారసులను ఇష్టారాజ్యంగా వదిలేశారు. దీంతో..వీరు అడ్డగోలుగా దోచేసి జైలుకు వెళ్లివచ్చారు. జైలుకు వెళ్లి వచ్చినా..వీరు మాత్రం పదవుల కోసం..ప్రాకులాడుతూనే ఉన్నారు. ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వారసుల గురించి మాట్లాడుకుందాం. వై.ఎస్.పుత్రరత్నమైన జగన్మోహన్‌రెడ్డి వై.ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. అప్పట్లో వై.ఎస్. పుత్రరత్నాన్ని వెనుకేసుకొచ్చి..ఆయన దోపిడీకి తలుపులు తెరిచారు. దీంతో..జగన్ ఉమ్మడి రాష్ట్రాన్ని టోకుగా దోచేసుకున్నారు. అయితే కాలపరీక్షలో వై.ఎస్ మరణించడం..తరువాత జగన్‌కు జైలుకు వెళ్లడం..వై.ఎస్. సానుభూతితో ముఖ్యమంత్రిగా అవడం చకచకా జరిగిపోయాయి. అయితే..ముఖ్యమంత్రి అయిన తరువాత స్వంత చెల్లెలకు దోచిన సొమ్మును పంచుకోవడంలో అన్నాచెల్లెలకు తేడాలొచ్చాయి. మహాభారతంలో దుర్యోధనుడు సూదిమొనమోపినంత భూమిని కూడా పాండవులకు ఇవ్వనన్నట్లు...తాను సంపాదించిన ఆస్తిలో తన సోదరి షర్మిలకు నయాపైసా ఇవ్వనని తేల్చి చెప్పడంతో..పాప..అన్నపై తిరుగుబాటు చేసింది. అన్న ఓటమికి తన వంతు పాత్ర పోషించింది. అంతేనా..ఇప్పుడు అన్న జైలుకు పోతే..తాను వై.ఎస్.వారసురాలిగా ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటోంది. ఇది వై.ఎస్. వారసుల లొల్లి.
ఇది ఇలా ఉంటే..ప్రత్యేక తెలంగాణ తెచ్చానంటూ..తన వల్లే తెలంగాణ వచ్చిందంటూ..తెలంగాణ బాపుగా చెప్పుకునే కె.చంద్రశేఖర్‌రావు ఇంట్లో కూడా ఇదే రీతిలో లొల్లి మొదలైంది. అప్పట్లో ఆంధ్రావాళ్లను తెగతిట్టి తెలంగాణ సాధించానని తెలంగాణ పౌరులను నమ్మించి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా తన వారసులకు తెలంగాణను దోచిపెట్టాడనడంలో ఎటువంటి శభిషలు లేవు. ఈ దోపిడీలో కుమారుడు కెటిఆర్, కుమార్తె కవిత ఇద్దరూ పోటీ పడ్డారు. ఎవరికి దొరికింది వారు దోచారనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు లిక్కర్ కేసులో కవిత తీహార్ జైలుకు వెళ్లివచ్చింది. వీళ్ల దోపిడీ చూసిన చైతన్యవంతులైన తెలంగాణ వాసులు.. మొన్నటి ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబానికి కర్రుకాల్చి వాతపెట్టారు. అధికారం పోవడంతలో కెసిఆర్ వారసుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. మళ్లీ ఎన్నికలు జరిగితే..తానే ముఖ్యమంత్రిని కావాలని కెటిఆర్, కాదు..తానే కావాలని కవిత ఇద్దరూ హోరాహోరిగా పోరాడుతున్నారు. ఈ పోటీలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నలిగిపోతున్నారు. ఇద్దరి మధ్యసయోధ్య కుదర్చలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కుమార్తె కవిత ప్రత్యేక పార్టీ పెట్టడానికి రంగం సిద్ధంచేసుకుంటోంది. మద్యం కేసులో తాను జైలుకు వెళ్లానని, జైలుకు వెళ్లిన వారే ముఖ్యమంత్రి కావాలనే ఆచారం ఉంది కనుక తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఎందుకు తననే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కెటిఆర్..ఇలా అన్నాచెల్లెలు..ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రాలో..జగన్, షర్మిలు..తెలంగాణలో కెటిఆర్, కవిత పదవీ యుద్ధాలు చూపురల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రాలో తనను మోసం చేసిన జగన్‌ను షర్మిల ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. రేపు తెలంగాణలో కూడా కెటిఆర్‌ను ఓడించడానికి కవిత రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.మొత్తం మీద అన్నాచెల్లెళ్ల పోరు రాజకీయవర్గాల్లో అమితాసక్తిని కల్గిస్తోంది.