లేటెస్ట్

‘నిమ్మగడ్డ’ లేఖతో వైకాపాలో కల‌వరం...!

స్థానిక ఎన్నికలు, కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని అల్లక‌ల్లోనికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా...రాష్ట్రం మొత్తం ‘స్థానిక ఎన్నిక’లు హడావుడి జరిగితే..ఆ ఎన్నికల‌ను వాయిదా వేసి రాష్ట్ర ఎన్నిక కమీషనర్‌ సంచల‌నం సృష్టించారు. ‘కరోనా’ నేపథ్యంలో ‘స్థానిక’ ఎన్నికల‌ను వాయిదా వేస్తున్నానని ఆయన ప్రకటించడంపై అధికారపక్షం మండిపడింది. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి శాసనసభ స్పీకర్‌ కూడా ఎన్నికల‌ కమీషనర్‌కు కులాన్ని ఆపాదిస్తూ విమర్శలు గుప్పించారు. ‘చంద్రబాబు’కు మేలు చేయడం కోసమే ఆయన ఎన్నికల‌ను వాయిదా వేశారని ధ్వజమెత్తి, ఎన్నికల‌ను ప్రకటించిన షెడ్యూల్‌లోనే జరపాల‌ని నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఎన్నికల‌ వాయిదా వేయడం సరైనదేనని, ఎన్నికల‌ కమీషనర్‌ విధుల్లో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. అయితే ఎన్నికల‌ కోడ్‌ను తొల‌గించాల‌ని, మళ్లీ ఎన్నికల‌ను ఎప్పుడు పెట్టాల‌న్నది పూర్తిగా ఎన్నికల‌ కమీషన్‌ నిర్ణయమేనని పేర్కొంది. ‘సుప్రీం’ తీర్పుపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేయగా, ఆశ్చర్యకరంగా అధికారపార్టీ ‘సుప్రీం’ కోర్టు ఎన్నికల‌ కమీషన్‌ను తప్పుపట్టిందని, ఎన్నికల‌ కోడ్‌ ఎత్తివేయడం తమ విజయమని పేర్కొంది. సరే ఇది ఎవరి విజయమైనా..ఎవరు ఎన్ని భాష్యాలు చెప్పుకున్నా...రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేలిపోయింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ కేంద్రహోంశాఖ కార్యదర్శికి రాశారని చెబుతోన్న లేఖ సంచనం సృష్టిస్తోంది. 

నా ప్రాణాల‌కు ముప్పు ఉంది...!

సుప్రీంకోర్టు తీర్పు తరువాత రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ కేంద్రహోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో తన ప్రాణాల‌కు ముప్పు ఉందని, స్థానిక ఎన్నికల‌ను వాయిదా వేశాననే కారణంతో అధికారపార్టీ నేతలు..తనపై, తన కుటుంబంపై దాడులు చేసే అవకాశాలున్నాయని, కేంద్ర బల‌గాతో తనకు రక్షణ కల్పించాని కోరారు. స్థానిక ఎన్నిక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హింస చెల‌రేగిందని, దాదాపు 20శాతం ఏకగ్రీవాల‌ను చేసుకున్నారని, ప్రత్యర్థుల‌ను భయపెట్టి, కిడ్నాప్‌లు చేసి, చివరకు నామినేషన్లు వేయకుండా అరాచకానికి పాల్పాడ్డారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. చివరకు ముఖ్యమంత్రి స్వంత జిల్లా అయిన కడప జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌ స్థానం ఏకగ్రీవం చేసుకున్నారని, అక్రమాల‌కు ఇంత కన్నా సాక్ష్యాలు అక్కర్లేదని ఆయన ఆ లేఖలో తెలిపారు. ఎన్నికల్లో అక్రమాల‌కు బాధ్యులైన అధికారుల‌పై తాను చర్యలు తీసుకుంటే తనకు కులాన్ని ఆపాదించి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు స్పీకర్‌ కూడా దూషిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో తాను ఇక్కడ పనిచేయలేనని, తనకు ఇక్కడ రక్షణ లేదని, హైదరాబాద్‌లో ఉండి పనిచేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాల‌ని, తనకు కేంద్ర భద్రతాదళాల‌తో రక్షణ కల్పించాల‌ని పేర్కొన్నారు. 

ఆయన రాసిన లేఖ చూస్తే...రాష్ట్రంలో  ఇప్పటి వరకు జరిగిన ‘స్థానిక’ ఎన్నికల‌ తంతు మొత్తం యావత్‌ దేశ దృష్టిని ఆకర్షిస్తుందన్న మాట నిజం. అధికారపార్టీ ఎన్నికల‌ను ఎలా నిర్వహించింది...? ఎలా దౌర్జ్యన్యాల‌కు ప్పాడింది...అధికారుల‌ను, పోలీసుల‌ను ఎన్నికల‌ సందర్భంగా అధికారపార్టీ ఎలా వాడుకున్నారనేది బయటపడిపోతుంది. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న అధికారికే భద్రత లేకపోతే...ఇక రాష్ట్రంలో సామాన్యుల‌ పరిస్థితి ఏమిటనే దానిపై దేశ వ్యాప్త చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో నెల‌కొన్న వివిధ సంస్థలు ఇక్కడ అరాచకం జరుగుతోందని, ఇక్కడి నుంచి కంపెనీలు తరలించుకుపోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల‌నుకునేవారు...తమ సంస్థల‌ను వేరే రాష్ట్రాల‌కు తీసుకుపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే...ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది తెలిసిపోతుందన్న భావన వైకాపా నాయకుల్లో ఉంది. మొత్తం మీద..ఎన్నిక కమీషనర్‌ ‘రమేష్‌కుమార్‌’ రాసిన లేఖ భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాల‌కు దారి తీస్తుందో అన్న ఆందోళన కొంత మంది వైకాపా నాయకుల్లో ఉంది. 

(556)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ