WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దేశంలో మతమార్పిళ్ల కోసం రూ.13000కోట్లు

భారతదేశంలో మతమార్పిళ్ల కోసం ప్రతి సంవత్సరం విదేశాల నుంచి దాదాపు 13వేల కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయంటూ హోంశాఖ నిఘా వర్గాలు నివేదికను సమర్పించాయి. ముఖ్యంగా 18 సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ డబ్బు వచ్చిందని తేల్చాయి. అమెరికా నుంచి ఇద్దరు, యూరప్‌ నుంచి ఇద్దరు, దక్షిణ కొరియా నుంచి ఇద్దరు డోనార్లున్నారని నివేదకలో పేర్కొన్నారు. చిన్నచిన్న సంఘటనలకు మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని డోనార్ల నుంచి ఎన్‌జివోలకు ఆదేశాలున్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్‌జిఓలు మావోయిస్టు సంస్థల మాదిరిగా, ఉగ్రవాద సంస్థలుగా, వారికి అనుకూలంగా పనిచేస్తున్నాయని నిఘావర్గాల నివేదికలో ఉంది. అటు డబ్బు వెదజల్లి మతాంతీకరణ చేస్తున్నారన్న నిఘావర్గాల నివేదికపై బిజెపి ఆందోళన వ్యక్తం చేసింది. మతాంతీకరణలు అత్యంత ఆందోళనకరమైన అంశమని తెలిపింది. కేంద్రం దీనిపై దృష్టి సారించి లోతుగా విచారణ జరిపించి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని బిజెపి కేంద్రాన్ని కోరింది.

(153)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ