లేటెస్ట్

ప్ర‌తి ప‌ది మందిలో తొమ్మిది మంది ఈ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌మే...!

ఇన్నాళ్లూ ప్ర‌జ‌ల‌ను, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను భ‌య‌పెట్టి పాల‌న చేసిన వైకాపా నాయ‌కుల‌కు ఇప్పుడిప్పుడే..ప్ర‌జ‌ల అస‌లైన మ‌నోభావాలు తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వ‌చ్చి ఐదేళ్లు అయినా..తాము సంక్షేమ‌మంటూ పంచుతోన్న సొమ్ముతో త‌మ‌పై ప్ర‌జ‌ల‌కు చాలా ప్రేమ ఉంద‌ని, ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా..175\175 వ‌స్తాయ‌ని బాకాలు ఊదుకున్న వైకాపా అగ్ర‌నాయ‌కులు అస‌లైన నిజం తెలుసుకు నివ్వెర‌పోతున్నారు. ఇన్నాళ్లూ ప్ర‌జ‌లు తాము ఎంత విధ్వంసం చేసినా, అరాచ‌కాలు చేసినా మౌనంగా భ‌రించారు. ఇప్పుడు ఎన్నిక‌లు రానుండ‌డంతో..ఇన్నాళ్లూ మౌన‌ముద్ర‌దాల్చిన ప్ర‌జ‌లు ఇప్పుడు గొంతు స‌వ‌రించుకుంటున్నారు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌నాకాలంలో ఏమి చేశారో..చెప్పాలంటూ..నిల‌దీస్తున్నారు. ఏ న‌లుగురు ఒక చోట చేరినా..ఇదే చ‌ర్చ‌. త‌మ‌కు బిచ్చం వేసి, వైకాపా నాయ‌కులు దోచుకున్నార‌నే..చ‌ర్చ వారి మ‌ధ్య జోరుగా సాగుతోంది. సంక్షేమం పేరిట కొంత మేర సొమ్ములు పంచినా..త‌మ నుంచి లాక్కున్న‌దే ఎక్కువ‌నేది వారి చ‌ర్చ‌ల్లో ప్ర‌ధానంగా ఉంటోంది. ఐదున్న‌రేళ్ల కాలం క్రితం జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌న్నీ న‌మ్మిన వారు..ఇప్పుడు తాము మోసపోయామ‌నే భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు కంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమం చేస్తాడ‌ని, యువ‌కుడు, తండ్రి వ‌లే ప్ర‌జ‌ల‌కు ఎంతో కొంత మేలు చేస్తార‌నే అంచ‌నాతో ఆయ‌న‌కు భారీ మెజార్టీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అయితే..వారి అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో జ‌గ‌న్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. 

ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా..దీనిపై సుధీర్ఘ ఉప‌న్యాసాల‌ను, నిట్టూర్పుల‌నిడిస్తున్నారు. చివ‌ర‌కు స్వంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఆ పార్టీ సానుభూతి ప‌రుల‌దీ ఇదే దోవ‌. ఒక‌ప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయంటే..అధికార‌పార్టీపై నెల‌కొన్న అసంతృప్తి వారిలోనే ఉండేది. అది బ‌హిరంగంగా వ్య‌క్తం చేసేవారు కాదు. పోలింగ్ రోజున ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఓట్ల రూపంలో వెల్ల‌డించేవారు. అయితే..ఈసారి ఆశ్చ‌ర్య‌క‌రంగా ప్ర‌భుత్వంపై వారిలో వ్య‌తిరేక‌త కంటే క‌సి ఎక్కువ క‌నిపిస్తోంది. ఈ ప్ర‌భుత్వాన్ని ఎట్టిప‌రిస్థితుల్లో మ‌ళ్లీ గెల‌వ‌నీయ‌కూడ‌ద‌నే..నోటి మాట జోరుగా సాగుతోంది.మ‌ళ్లీ ఈ ముఖ్య‌మంత్రి అధికారంలోకి వ‌స్తే..ఇంకేమీ ఉండ‌ద‌నే మాట వారి నుంచి య‌ధేచ్ఛ‌గా విన‌ప‌డుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ త‌మ‌కు అత్యంత స‌న్నిహితుల వ‌ద్దే ఈ అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేసేవారు. ప్ర‌భుత్వానికి, అధికార‌పార్టీ నాయ‌కుల భ‌య‌ప‌డి వారు గుంభ‌నంగా త‌మ‌లో తాము భావాల‌ను వ్య‌క్తం చేసేవారు. అయితే..ఇప్పుడు వారు..బ‌హిరంగ‌గా ప్ర‌భుత్వంపై వ్యాఖ్యానించ‌డానికి భ‌య‌ప‌డ‌డం లేదు. ప్ర‌తి ప‌దిమందిలో 9 మంది ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. దీనిలో ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను అందుకున్న‌వారు..ఉండ‌డం కూడా విశేషం. జ‌గ‌న్ చెప్పిన‌ట్లు ప్ర‌భుత్వం నుంచి మేళ్లు పొందిన అక్క‌చెళ్లులు, ఇత‌ర వ‌ర్గాలు కూడా దీనిలో ఉన్నాయి.  ల‌క్ష‌ల‌కోట్లు తాము పేద ప్ర‌జ‌ల ఖాతాలో వేశామ‌ని, ప్ర‌తిరోజూ ఏదో ఒక బ‌ట‌న్ నొక్కుతున్నామ‌ని చెబుతున్నా...ప్రజ‌ల్లో ప్ర‌భుత్వంపై ఇంత వ్య‌తిరేక‌త ఉండ‌డ‌మేమిట‌ని వైకాపా నాయ‌కులు త‌ల‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు. అయితే ప్ర‌భుత్వ విధానాలు, ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హార‌శైలే దీనికి కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. తాము ఏమి చేసినా..ప్ర‌జ‌ల‌కు ఎంతో కొంత ఇస్తే..వారు..త‌మ‌ను స‌మ‌ర్థిస్తార‌నే వైకాపానేత‌ల విశ్వాసంపై ప్ర‌జ‌లు ఘోర‌మైన దెబ్బ‌ను రాబోయే ఎన్నిక‌ల్లో కొట్ట‌బోతున్నారు. అదెంత క‌సిగా ఉంటుందంటే చాలాచోట్ల అధికార‌పార్టీకి డిపాజిట్లు కూడా రానంత‌గా...!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ