లేటెస్ట్

ఆ లేఖ ‘నిమ్మగడ్డ’దే :కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత

తన ప్రాణాల‌కు రక్షణ లేదని, స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అధికారపార్టీ ఇష్టం వచ్చినట్లు బరితెగించి వ్యవహరించిందని పేర్కొంటూ తన ప్రాణాలను కాపాడాల‌ని కోరుతూ రాష్ట్ర ఎన్నికల‌ సంఘం కమీషనర్‌ ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ లేఖ రాసింది నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజుగా ‘రమేష్‌కుమార్‌’ రాసిన లేఖపై వివాదం చెల‌రేగింది. ఆయన లేఖ రాయలేదని, అది టిడిపి నాయకులు సృష్టించిన లేఖ అని అధికారపక్షం వాదించింది. ఆయన రాసిన లేఖ ముందుగా టిడిపికి అనుకూలంగా ఉండే పత్రికల‌కు చేరిందని, అందువ‌ల్ల‌ అది ఆయన రాసిన లేఖ కాదని, దీని వెనుక కుట్ర ఉందని పేర్కొంటూ, దీనిపై విచారణ జరిపించాల‌ని రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసింది. అయితే ఇప్పుడు ఈ లేఖపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ‘కిషన్‌రెడ్డి’ స్పష్టతను ఇచ్చారు. ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారని, ఆయన ఎప్పుడు అమరావతి వెళ్లినా ఆయనకు రక్షణ కల్పిస్తామని, తన ప్రాణానికి రక్షణ కల్పించాల‌ని రాసిన లేఖ ‘రమేష్‌’దేనని, తాను హోంశాఖ అధికారుతో మాట్లాడానని ‘కిషన్‌రెడ్డి’ పేర్కొన్నారు.  ‘కిషన్‌రెడ్డి’ ఇచ్చిన స్పష్టతతో ఇప్పటి వరకు లేఖపై నెల‌కొన్న గందరగోళానికి స్పష్టత ఇచ్చినట్లైయింది.

(404)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ