లేటెస్ట్

హత్యకేసులో ముద్దాయిలు అరెస్ట్

ఆళ్లగడ్డ పట్టణంలోని ఎరుకల కులానికి చెందిన సుస్మిత ప్రతాప్ లు ప్రేమించుకున్నారు ఇద్దరిది ఒకే కులం కావటంతో ఇరువురి పెద్దలు  వారి ప్రేమకు అడ్డు చెప్పకుండా పెళ్లి ఘనంగా చేశారు.  ఈ పెళ్లికి కట్నకానులకింద సుస్మిత తండ్రి సుంకన్న రూ.80.000లు. నగదు రెండు తులాలు బంగారం ఇచ్చినట్లు  ఆళ్లగడ్డ  డిఎస్పీ పోతురాజు తన కార్యాలయంలో  విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  సుస్మిత ప్రతాప్ ల పెళ్ళి తొమ్మిది నెలల క్రితం జగిరిగింది. ఈ పెళ్ళికి గాను సుస్మిత తండ్రి సుంకన్న 80000 వేలు నగదు రెండు తులాల బంగారం కట్నం ఇచ్చాడు అయితే సుస్మిత కు వివాహం జరిగే సమయానికి బీఎస్సీ నర్సింగ్ చదువు కునేది వివాహం తరువాత చదువుకుంటానని భర్తతో చెప్పినప్పుడు భర్త మరియు అత్త, మామ,బావ, పిన్నమ్మ లు  నువ్వు చదువుకోవడానికి వీలు లేదని తరుచూ ఆమెపై దాడి చేసి అదనపు కట్నం కోసం కొట్టి వేధించే వారని అన్నారు అలాగే ఆమెపై భర్త ప్రతాప్ అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవారని అదనపు కట్నం కోసం తండ్రి శుంకన్న ను కూడా  వేదించేవారని డిఎస్పీ తెలిపారు సుస్మిత తల్లి వి  నగలు తీసుకురావాలని అన్నారని ఆనగలు సుస్మిత తాత దగ్గర వున్నాయని తెలిపారన్నారు. అయితే సుస్మిత నంద్యాల కు పోయి వస్తాము అనిబర్తకు చెప్పడంతో ఇదే అదునుగా ఎలాగైనా సుస్మితను వదిలించుకోవాలని అందరు పన్నాగం పన్నారు నంద్యాలకు పోయి తిరుగు ప్రయాణం లో బత్తలురు గ్రామ సమీపాన. ఆమెను ఒక నిటి కుంట దగ్గరకు తీసుకొనిపోయి ఒక పదునైన కత్తితో ఆమె చేతి మణికట్టు దగ్గర కోసాడు తరువాత ఆమె చీరతో చేతులకు కట్టి నిటి కుంటలో తోసి చంపి చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఇంటికి వెళ్లిపోయారు ఏమి ఎరుగనట్లు వున్నారు సుస్మిత తండ్రి తన కూతురు కనిపించక పోవటంతో పోలీసులను ఆశ్రయించాడు.  విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సుస్మిత భర్త వారి కుటుంబ సభ్యులు  సుస్మితను హత్య చేసినట్లు తేల్చి ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సుదర్శన్ ప్రసాద్ రూరల్ యస్ ఐ రమేష్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ కోటి పాల్గొన్నారు.

(110)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ