లేటెస్ట్

అకాల‌వర్షంతో నష్టపోయిన రైతుల‌ను ఆదుకోవాలి : భూమా అఖిల‌ప్రియ

ఆళ్ళగడ్డ మార్చి 21 (జనం ప్రతినిధి) : శుక్రవారం రాత్రి ఆళ్ళగడ్డ మండలంలో వడగళ్ళవర్షం కురిసింది. ఈ వర్షానికి మండలంలో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విత్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనేకచోట్ల పంటనష్టం వాటిల్లింది. ఈవిషయంపై మంత్రి భూమా అఖిల‌ప్రియ నాగిరెడ్డిపల్లె గ్రామం చేరుకొని అక్కడ వర్షానికి పడిపోయిన పంటపొలాల‌ను పరిశీలించి రైతుల‌ను అడిగి విషయాలు తెలుసుకున్నారు. రైతుల‌ వెంట ఆమె పంట పొలాల‌వద్దకు వెళ్లారు. మహిళా రైతులైన పుల్ల‌మ్మ‌, ఎనిమిది ఎకరాల‌ వరి, మూడు ఎకరాలు మెక్కజొన్న వేసినట్లు తెలిపారు. పెట్టుబడి దాదాపు ఎకరాకు ముప్పైవేల‌ రూపాయ‌లు చొప్పున పెట్టుబడి పెట్టినట్లు ఆమె వివరించారు.  ల‌క్ష్మిదేవి తన  ఏడుఎకరాల‌ వరి మూడు ఎకరాలు మెక్కజొన్న చేతికందిన పంట వర్షం వ‌ల్ల దెబ్బ‌తిన‌డంతో కన్నీటిపర్యంతమయ్యింది. వారి భాదను ఆమె విని వారిని ఓదార్చి ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి మీకు పంట నష్టానికి తగిన న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఒక్క నాగిరెడ్డిపల్లెలోనే దాదాపు మూడువందల‌ ఎకరాల‌ మెక్కజొన్న రెండువందల‌ ఎకరాల‌ వరిపంట నష్టం జరిగిందన్నారు. ఆవిధంగా ఆళ్ళగడ్డ మండంలోని అన్నిగ్రామాలో ఎంత పంట నష్టం జరిగిందో ప్రభుత్వ అధికారులు గుర్తించి అకాల‌వర్షంతో  నష్టపోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు.

(39)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ