లేటెస్ట్

ఈ వారం ‘కులం’తో మొదలై..‘కరోనా’తో ముగిసింది...!

వారం రోజుల‌ క్రితం దాకా రాష్ట్రంలో స్థానికల‌ ఎన్నికల‌ హడావుడి. అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థుల‌ను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఈ సందర్భంగా జరిగిన హింస, టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌పై మాచర్లలో హత్యాహత్యం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అధికారపార్టీ అరాచకాల‌తో రాష్ట్రం అట్టుడికిపోయింది. స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న ‘హింస’పైనే రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి నెల‌కొన్న సందర్భంలో ‘కరోనా’ భయంతో ‘స్థానిక’ ఎన్నికల‌ను ఆరు వారాల‌ పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ ప్రకటించడం సంచల‌నం సృష్టించింది. ఎన్నిక వాయిదా...సంగతి ఎలా ఉన్నా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి స్పందిన తీరు, ఆయన సంధించిన కుల‌ ఆరోపణలు పెను సంచల‌నాన్ని సృష్టించాయి. ఇదే సమయంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకి స్పీకర్‌ ‘తమ్మినేని సీతారాం’ కూడా సీఈసీపై కుల‌ విమర్శలు చేయడంతో అవాక్కు అవడం రాష్ట్ర ప్రజల‌ వంతైంది. ‘కరోనా’తో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల‌ ఎన్నిక కమీషనర్లను, కేంద్రాన్ని సంప్రదించి ఎన్నికల‌ను వాయిదా వేశానని ‘రమేష్‌కుమార్‌’ చెప్పినా...వైకాపా నేతల‌ ఆగ్రహం చల్లారలేదు. చివరకు ఈ విషయంపై ‘సుప్రీంకోర్టు’కు వెళ్లితే ‘సుప్రీం’ ‘నిమ్మగడ్డ’ నిర్ణయాన్నే సమర్థించింది. అయితే తరువాత..తనకు అధికారపార్టీ నుంచి ప్రాణభయం ఉందని, తాను ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదని, తనకు కేంద్ర బల‌గాల‌ భద్రత కల్పించాని ‘రమేష్‌కుమార్‌’ కోరడం మరింత సంచనం సృష్టించింది. ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖ వివాదాస్పదం కావడం, ఆయన ఆ లేఖ రాయలేదని, ఆ లేఖను టిడిపి నేతలే సృష్టించారని వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు ఆరోపించి డీజీపీకి ఫిర్యాదు చేశారు. చివరకు కేంద్ర హోంశాఖ దీనిపై స్పష్టతను ఇచ్చి ఆయనకు కేంద్ర భద్రతను కల్పించి హైదరాబాద్‌లో పనిచేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ తీవ్ర విమర్శల‌ను ఎదుర్కొన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సమయంలో ఆ పార్టీ చేసిన కుల‌ విమర్శు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. తాము చెప్పినట్లు వినకపోతే..వారు ఎవరైనా సరే..వారిపై ఎటువంటి ఆరోపణలు, విమర్శలు చేయడానికి సిద్ధం అవుతామని, తాజాగా ఎన్నిక ల‌కమీషనర్‌పై వారు చేసిన విమర్శు చాటి చెబుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ వారం మొదటిలో ఎన్నికలు, ఎన్నికల‌ కమీషనర్‌ వ్యవహారశైలి, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేసిన కుల‌ విమర్శలు తదితరాలు చర్చనీయాంశం అయితే...ఆదివారం వచ్చే నాటికి అవన్నీ పూర్వపక్షం అయ్యాయి.  స్థానిక ఎన్నికలు వాయిదా పడిన తరువాత రాష్ట్ర  ప్రభుత్వం అనాసక్తిగా ‘కరోనా’పై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో ‘కరోనా’ గురించి భయపడాల్సిన పనిలేదని, దానికి పారాసెట్‌మాల్‌, బ్లీచింగ్‌ పౌడరు చల్లితే సరిపోతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్న తరువాత...ప్రభుత్వ అధికారులు నుంచి ‘కరోనా’పై పెద్దగా దృష్టి పెట్ట‌లేదు. అయితే ‘స్థానిక’ ఎన్నికల‌ వాయిదాను ‘సుప్రీంకోర్టు’ సమర్థించిన తరువాత...రాష్ట్ర ప్రభుత్వం ‘కరోనా’పై దృష్టి పెట్టింది. అప్పటి వరకు విద్యా సంస్థల‌కు కూడా సెల‌వు ప్రకటించలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థల‌కు, పార్కుల‌కు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల‌కు సెల‌వు ప్రకటించినా..ఆంధ్రాలో మాత్రం సెల‌వులు ప్రకటించలేదు. అయితే చివరకు ‘కరోనా’ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో...ప్రభుత్వం ముందుకు కదిలింది. ‘కరోనా’ ల‌క్షణాతో రాష్ట్రానికి వచ్చిన ప్రయాణీకుల‌ను క్వారైంటైన్‌ చేయడం, ఐసోలేషన్‌కు తరలించడం తదితర చర్యులు తీసుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని ‘మోడీ’ ప్రకటించిన ‘జనతాకర్ఫ్యూ’తో ప్రభుత్వ వర్గాలు మొత్తం దీనిపై దృష్టి సారిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’తో ‘ఆదివారం’ ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తుండడంతో రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెల‌కొని ఉంది. ‘జనతాకర్ఫ్యూ’ కోసం అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నారు. శనివారం ఎక్కడ చూసినా...రేపటి ‘జనతాకర్ఫ్యూ’ గురించే చర్చించుకుంటున్నారు. ఆదివారం నాడు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు, అవసరమైన నిత్యావసర వస్తువుల‌ను ‘శనివారం’ నాడే సిద్ధం చేసుకుంటున్నారు. వాస్తవానికి..ముఖ్యమంత్రి చెప్పినట్లు చేస్తే...రేపు ‘జనతాకర్ఫ్యూ’ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన స్థానిక ఎన్నికల‌ను జరపాని, పది రోజు కళ్లు మూసుకుంటే ‘స్థానిక’ ఎన్నికలు అయిపోయేవని, పదే పదే చెబుతున్నారు. నిన్న కూడా ఇదే విషయంపై మరోమారు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా..ఒకవైపు ప్రజలు గుమికూడి ఉండవద్దని చెబుతున్న ప్రభుత్వమే ఎన్నికలు జరిగితే బాగుండేదని చెప్పడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ‘కరోనా’ ప్రభావాన్ని ముందుగానే ఊహించి ఎన్నికల‌ను వాయిదా వేసిన ‘నిమ్మగడ్డ’పై అనవసర ఆరోపణలు, విమర్శలు చేశామనే భావన ఇంత అల్ల‌క‌ల్లోం జరుగుతున్నా..అధికారపార్టీ నేతల్లో కల‌గడం లేదు. అదే అన్నిటికన్నా విచిత్రం...మొత్తానికి  ఈవారం ‘కుల‌’ విమర్శల‌తో రాజ‌కీయాలు మొదలవ‌గా..వారాంతం వ‌చ్చేస‌రికి ప్రాణాంత‌క క‌రోనాతో రాజ‌కీయాలు పూర్వ‌ప‌క్షం అయ్యాయి.

(178)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ