లేటెస్ట్

చిన్న పత్రికల‌కు హాజరు నుంచి రెండు నెల‌లు మినహాయింపు ఇవ్వండి:కె.ఎస్‌.రంగసాయి

ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్‌-19 వైరస్‌ అన్ని రంగాల‌తో పాటు పత్రికా రంగాన్ని కూడా తాకింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజాజీవ‌నానికి తీవ్ర ఇబ్బందులు క‌లుగుతుండ‌గా, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మరియు షాప్స్‌, హాస్పటల్స్‌, మాల్స్‌ మూతపడ్డాయని, తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెల‌కొందని దీంతో పత్రికల‌ను ముద్రించడం, పంపిణీ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చిన్న పత్రికల‌ సంఘం గౌరవ సల‌హాదారు కె.ఎస్‌. రంగసాయి అన్నారు.  ముఖ్యంగా చిన్నపత్రికలు తీవ్ర ఇబ్బందులను, కష్టాల‌ను  ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల‌లో పీఐబీకి సమర్పించాల్సిన పత్రికల‌ను ‘కరోనా’ భయంతో ఇవ్వలేకపోయే పరిస్థితి ఉందని, ‘కోవిడ్‌-19’ ఉధృతి తగ్గే వరకు పత్రికల‌కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల‌ని ఆయన డిఏవీపి డైరెక్టర్‌ జనరల్‌ ‘సత్యేంద్ర ప్రకాష్‌’, పీఐబీ డైరెక్టర్‌ శ్రీమతి వసుధ గుప్తాల‌కు ‘రంగసాయి’ విడి విడిగా  లేఖలు రాశారు. స్వంత ప్రింటింగ్‌ యూనిట్లు ఉన్న పత్రికలు ఆయా పత్రికల‌ను ముద్రించినా, వాటిని పంపిణీ చేయడం కష్టతరమవుతుందని, ‘కరోనా’ వ‌ల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు స్వచ్చంధంగా ‘కర్ఫ్యూ’ను పాటిస్తున్నారని, ఇటువంటి సమయంలో పీఐబీకి కాని,డిఏవీపీ, ఐ&పిఆర్‌కు కానీ పత్రికల‌ను తీసుకెళ్లడం కష్టం అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రెండు నెలల కాలంలో చిన్న పత్రికల‌ను హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాని ఆయన కోరారు.  

(527)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ