లేటెస్ట్

ఆళ్ళగడ్డలో విజయవంతంగా ‘జనతా కర్ఫ్యూ’

ఆళ్ళగడ్డ,మార్చి 22 (జనం ప్రతినిధి) : జనతా కర్ఫ్యూ సందర్బంగా ఆదివారం కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డలో జన సంచారం లేక నిర్మాణుశ్యంగా మారింది. ప్రధాన కూడళ్లు, రహదారుల‌లో ఎక్కడ మనుష్యులు లేకుండా ఇదే మొదటి సారి అనిపించేలా కనిపించింది. కూరగాయల మార్కెట్లు, నిత్యావసరాల‌ సముదాయాలు, మూతపడ్డాయి. ప్రజలు స్వచ్చందంగా ఇంటికే పరిమితమయ్యారు. కిరాణా షాపులు సంతమార్కెట్టు, మాంసపు దుకాణాలు, వైన్‌షాపులు స్వచ్చందంగానే మూసివేసి జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమవ్వటంతో ఎక్కడ చూసినా నిర్మాణుశ్యంగా కనిపించింది.స్వచ్చందంగా ప్రజలందరు నడుంబిగించి కర్ఫ్యూ చేపట్టారు. అందులో భాగంగా ఆళ్ళగడ్డ నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ఎనబై శాతం ప్రభుత్వ ప్రచారం ఫలించాయని అధికారులు తెలిపారు. నియోజక వర్గ స్థాయిలో ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనటంతో పట్టణంలోనే కాకుండా అన్నిగ్రామాల్లో స్వచ్చందంగా ప్రజలు కరోనాపై  యుధ్దం ప్రకటించటంతో ఆళ్ళగడ్డ నియోజక వర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతం అయ్యింది. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో కరోనా వైరస్‌ నివారణకు పోలీసు, వైద్య సిబ్బంది, మున్సిపల్‌ శాఖ సిబ్బంది, అధికారులు అలాగే ప్రాత్రికేయుల‌కు మద్దతుగా చప్పట్లతో సీనియర్‌ సివిల్‌ జడ్జి శివశంకర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి దివాకర్‌బాబు ఆధ్వర్యంలో డియస్పీ పోతురాజు, ఏపిపి రమాదేవి, తాహశీల్దారు రవీంద్ర ప్రసాద్‌, మున్సిపల్‌ కమీషనర్‌ రమేష్‌ కుమార్‌, పట్టణ సిఐ రమణ. పట్టణ ఎసై, రామిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రూరల్‌ ఎస్సై రమేష్‌ కుమార్‌, వైద్యలు మున్సిప్‌ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు చప్పట్లతో సాఫీుభావం తెలిపారు.

(56)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ