లేటెస్ట్

‘లాక్‌డౌన్‌’ను పట్టించుకోని ప్రజలు...!

ప్రంచాన్ని భయపెడుతున్న ‘కరోనా’ను అరికట్టేందుకు వివిధ దేశాల‌ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. మనదేశంలోనూ ఇదే విధమైన ‘లాక్‌డౌన్‌’ను ప్రకటించారు. అయితే ఈ లాక్‌డౌన్‌ను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెల‌కొనగా, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెంగాణల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ‘జనతాకర్ఫ్యూ’ని విజయవంతం చేసిన ప్రజలు నేటి నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన ‘లాక్‌డౌన్‌’ను సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ఈ నెలాఖరు దాకా ‘లాక్‌డౌన్‌’ను ప్రకటిస్తున్నట్లు ఇరు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు ప్రకటించినా ప్రజలు తమ తమ పనుల‌ కోసం భారీగా రోడ్ల మీదకు వస్తున్నారు. అటు హైదరాబాద్‌, ఇటు విజయవాడల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ‘విజయవాడ’లో ఇది మరీ ఉదృతంగా ఉంది. ‘విజయవాడ’లోని పలు ముఖ్యప్రాంతాల్లో ప్రజలు ఉదయం నుంచే రోడ్ల మీదకు భారీగా వస్తున్నారు. ఉదయం పూట నిత్యావసర వస్తువుల‌ కోసం వచ్చారనుకున్నా..ఈ వార్త రాసే సమయానికి చాలా మంది ప్రజలు రోడ్లపైనే సంచరిస్తున్నారు. 

విజయవాడ బెంజిసర్కిల్‌, ఏలూరు రోడ్లు, బందర్‌రోడ్డు, బస్‌స్టాండ్‌ సమీపంలో న‌గ‌ర పౌరులు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. పలు వాహనాలు, ద్విచక్రవాహనాలు కూడా రోడ్ల మీదకు వచ్చాయి. అదే విధంగా కొన్ని షాపులు తెరవడంతో వారిని చూసి మరి కొందరు షాపులు తెరుస్తున్నారు. మరో వైపు కూరగాలయల ధరలు డబుల్‌రేట్లలో అమ్ముతున్నారు. నిత్యావసరాల‌ వస్తువు పరిస్థితి అదే విధంగా ఉంది. ‘లాక్‌డౌన్‌’ను సీరియస్‌గా అమలు చేయాల్సిన ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందనే మాట పలువురి నుంచి వ్యక్తం అవుతోంది. నిన్నంతా ఇళ్లల్లో ఉన్న ప్రజలు ఈ రోజు భారీగా రోడ్ల మీదకు రావడం ఆందోళన కల్గించే అంశమే. కాగా..దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సరిగా అమలు జరగకపోవడంపై కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘కరోనా’ గురించి ప్రజల‌కు అవగాహన కల్పించలేకపోతున్నారని, గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు ప్రజలు వస్తే మరింత ప్రమాదమనే విషయాల‌ను ప్రభుత్వం వివరించలేకపోతోంది. కఠినంగా ఆంక్షల‌ను అమలు చేయలేకపోతోంది. దీంతో పరిస్థితి దిగజారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే రూరల్‌ ప్రాంతాల్లో ‘కరోనా’ గురించి తెలియక రైతు, రైతు కూలీలు వ్యవసాయ పనుల‌ కోసం ఆటోలు, ఇతర వాహనాల్లో వెళుతున్నారు. ఇలా గుంపులుగా వెళితే పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చు. మొత్తం మీద..నిన్న ఒక్క రోజు రోడ్లపైకి రాకుండా నిబద్దతతో వ్యవహరించిన ప్రజలు...ఈ రోజు మాత్రం ఎప్పటిలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటేనే ప్రజలు రోడ్లపైకి రాకుండా ఆపవచ్చు. 

(298)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ